ఇండస్ట్రీలో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ఏ రేంజ్‌లో జరిగిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు, పెద్ద ఫ్యామిలీల పునాదులే కదిలాయి. శ్రీరెడ్డి అప్పట్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తెలుగమ్మాయలను ఎలా వాడుకుంటున్నారు.. ఎలా మోసం చేస్తుంటారు.. అన్న విషయాలపై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. మళ్లీ తాజాగా అలాంటి వ్యాఖ్యలే తేజస్వీ చేసింది.
కమిట్‌మెంట్ టీజర్ రిలీజ్ సందర్భంగా తేజస్వీ బోల్డ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిగా వచ్చిన తనకు చాలా కష్టాలు ఎదురయ్యాయని తెలిపింది. ఫస్ట్.. తెలుగమ్మాయి అనగానే తీసిపాడేస్తారని చెప్పింది. తెలుగమ్మాయి కాబట్టి కమిట్‌మెంట్ అడగడం ఈజీ అయిపోతుందట. హిందీ అమ్మాయిలను అయితే మేనేజర్ల సహాయంతో కాస్త కష్టపడాలని చెప్పింది. తెలుగమ్మాయిని కాబట్టి తనను డైరెక్ట్‌గా అడిగేసేవారని నిర్మొహమాటంగా చెప్పేసింది.
అలాంటి కమిట్‌మెంట్‌లు, అలాంటి వ్యక్తులను తప్పించుకుని ఇక్కడి వరకు వచ్చానని చెప్పింది. చాలా పెద్ద పెద్ద దర్శకులతో పనిచేశానని, చాలా చోట్ల ఇబ్బందికరంగా ఫీలయ్యానని చెప్పింది. అయితే తన కథను జనాలకు చెప్పే అవకాశం రాలేదని… అందుకే దేవుడు ఈ సినిమాను తనకు ఇచ్చాడని తెలిపింది. ఇది కచ్చితంగా నా లైఫ్ స్టోరీ.. ఈ స్థాయికి రావడానికి నేనెంత ఫైట్ చేశానో ఈ సినిమా చెబుతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చెబుతుందో మరి నిజంగానే అలాంటి పరిస్థితులను ఎదుర్కొందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.