జనసేన విషయంలో తెలుగు తమ్ముళ్ళ ఆలోచన మారుతోంది.!

2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో నిస్తేజం అనూహ్యంగా పెరిగిపోయింది. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తెలుగు తమ్ముళ్ళలో ఎక్కడా కనిపించడంలేదు. అనూహ్యంగా 2014 ఎన్నికల్లో టీడీపీ పుంజుకున్నా, తెలంగాణలో పార్టీని గాలికొదిలేశారు అధినేత చంద్రబాబు. ఆ తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లనూ క్రమక్రమంగా టీడీపీ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది.

‘మాదే బలమైన పార్టీ.. మేమే అధికారంలోకి వస్తాం..’ అని చంద్రబాబు చెబుతున్నా, ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా.? లేదా.? అన్న అనుమానమైతే తెలుగు తమ్ముళ్ళలో పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ పుంజుకోవడం కష్టం. మరి, ఏం చేయాలి.? లోకేష్ వల్ల పార్టీకి లాభం లేదు. బాలయ్య రాజకీయం వేరే. జూనియర్ ఎన్టీయార్, టీడీపీ బాధ్యతల్ని తీసుకునే అవకాశమూ లేదు.

ఇలా అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్న తెలుగు తమ్ముళ్ళు, తమ రాజకీయ భవిష్యత్తు విషయమై ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారట. వారికి జనసేన పార్టీ ఓ సేఫ్ ప్లేస్‌లా ప్రస్తుతానికి కనిపిస్తోంది. జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే సరే సరి. లేదంటే, జనసేనలోకి దూకెయ్యడమే బెటరని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటున్నారట.

‘ఒకవేళ పొత్తు కుదిరినా సరే, ఇప్పుడే జనసేనలోకి దూకేస్తే పోలా.?’ అన్న భావనతో వున్నారట తెలుగు తమ్ముళ్ళు. జనసేన అధినేత ఇటీవలి కాలంలో, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. అందుక్కారణం కూడా ఇదే. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు జనసేనకు చక్కటి అవకాశం కనిపిస్తోంది.

కానీ, జనసేన ఈ పొలిటికల్ వాక్యూమ్‌ని తనక అనుకూలంగా మార్చుకోగలదా.? లేదా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.