Home News హీరోయిన్‌ని ఫాల్తుదానివి అంటూ తిట్టిన నెటిజ‌న్.. దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన తాప్సీ

హీరోయిన్‌ని ఫాల్తుదానివి అంటూ తిట్టిన నెటిజ‌న్.. దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన తాప్సీ

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఇక్క‌డ పెద్దగా అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌కు మ‌కాం మార్చింది. అక్క‌డ తాప్సీ ప‌ట్టుకున్న‌దంతా బంగారం అయింది. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. లేడీ ఓరియొంటెడ్ చిత్రాల‌తో పాటు విభిన్న క‌థా చిత్రాలు చేసింది. ఇటీవ‌ల థ‌ప్ప‌డ్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తాప్సీ అందులోని త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

Tapsee Work | Telugu Rajyam

ఇప్పుడు ర‌ష్మీ రాకెట్ అనే సినిమా చేస్తున్న తాప్సీ ఇందులో అథ్లెట్‌గా క‌నిపించ‌నుంది. ఈ సినిమా కోసం త‌న శ‌రీరాకృతిని పూర్తిగా మార్చుకుంటుంది. ర‌న్నింగ్ చేసే వారి బాడీ ఎలా ఉంటుందో ఆ విధంగా త‌న శ‌రీరాన్ని మ‌ల‌చుకుంటుంది. తాప్సీ మేకొవ‌ర్ చూసి ఫ్యాన్స్‌తో పాటు సెల‌బ్రిటీలు వావ్ అంటున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆకర్ష్ ఖురానా కూడా… పాత్ర కోసం తాప్సీ పడుతున్న కష్టాన్ని చూసి ఫిదా అయ్యాడట.గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక రన్నర్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వైనాన్ని చిత్ర నేపథ్యంగా తీసుకున్నారని సమాచారం.

కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం చేస్తున్న క‌స‌ర‌త్తుల‌కి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ వ‌స్తుంది తాప్సీ. ఈ నేప‌థ్యంలో ఓ నెటిజన్‌ ఆమె బ‌ట్ట‌ల‌తో పాటు శ‌రీరాకృతిపై కామెంట్ చేశాడు. పొట్టి దుస్తులు వేసుకొని గ్లామ‌ర్ షో చేస్తూ సినిమా రంగంలో రాణిస్తున్నావు. నీలో ప్ర‌త్యేక‌త ఏమైన ఉందా ఫాల్తు దానా అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన తాప్సీ.. నేను ఏం చూపించానో తెలుసా నీకు? నా ప్రతిభ‌ను చూపించాను. అది నీకు అర్దం కాదు అంటూ గ‌ట్టిగానే బ‌దులిచ్చింది సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి. తాప్సీ కిట్టీలో ‘లూప్‌ లపేట’, ‘హసీన్ దిల్‌రూబా’అనే చిత్రాలు కూడా ఉన్నాయి

Tapsee Work1 | Telugu Rajyam

- Advertisement -

Related Posts

విజయవాడ దుర్గ గుడికి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్

నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో నిన్న జరిగిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) నిర్వహిస్తున్నారు....

ఆ విషయంలో ఎన్నడూలేనంత కంగారు పడుతున్న వైఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయటం, జరపలేమంటూ అధికార ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళటం, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు...

అలా ఎమోషనల్.. చిట్టి చెల్లితో రష్మిక ఆటలు

రష్మిక మందాన్నకు ఓ చిట్టి చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ మధ్య తెగ సెటైర్లు వచ్చాయి. రష్మిక మందాన్న ఏజ్‌కు, తన చెల్లి ఏజ్‌కు మధ్య అంత గ్యాప్...

Latest News