Thaman: నీ అడ్రస్ పంపు బే … నెటిజన్ పై ఫుల్ ఫైర్ అయిన తమన్!

Thaman: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో తమన్ ఒకరు. చిన్న తనం నుంచి సంగీతంపై ఎంతో ఇష్టమున్న ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక త్వరలోనే తమన్ సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలా వరుస సినిమాలతో ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్న తమన్ మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక సోషల్ మీడియాలో తన గురించి ఎవరైనా కామెంట్లు చేసిన తనదైన శైలిలోనే రియాక్ట్ అవుతూ వారికి సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఒక నెటిజన్ మాత్రం తమన్ కు చాలా కోపం తెప్పించే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు దీంతో తమన్ సైతం అదే విధంగా రిప్లై ఇస్తూ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆ నెటిజన్ తమన్ కు కోపం తెప్పించేలా ఏం చేశారనే విషయానికి వస్తే.. తమన్ కు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టం అనే సంగతి తలిసిందే.

తమన్ సీసీఎల్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీమ్ లో కీలక ప్లేయర్ సైతం కూడా. అలాంటి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు.అయితే ఆ వీడియోకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ తమన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. షార్ట్ కు.. స్లాట్ కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. దీంతో తమన్ అతనికి రిప్లై ఇస్తూ..”ఒకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పంపు బే” అంటూ రిప్లై ఇచ్చారు తమన్. ఇప్పుడు ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆ వీడియోలో తమన్ చెప్పింది కరెక్ట్ అని.. నువ్వే అనవసరంగా తెలియకుండా కామెంట్ చేశావంటూ తమన్ మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తమన్ మాత్రం సదరు నెటిజన్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.