Vijay Thalapathy: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న తమిళ హీరో విజయ్!

Vijay Thalapathy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయంలోకి అడుగు పెట్టనున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈయనకు రాజకీయం గురించి ఎన్ని ప్రశ్నలు ఎదురైనా తనకి ఆసక్తి లేదని చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా ఈయన ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. కారణం.. ఇటీవలే విజయ్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలవడం జరిగింది.

పైగా రాజకీయం గురించి కొన్ని చర్చలు చేసినట్లు కూడా తెలుస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి విజయ్ సన్నిహితులు కూడా అవుననే అంటున్నారు. దీంతో విజయ్ రాజకీయం ఎంట్రీ ఉంటుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో దళపతి విజయ్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.