Bigg boss 4: బిగ్ బాస్ హౌస్ నుంచి ఆ లేడీ ఔట్? మరి అభిజిత్ పరిస్థితి ఏంటి?

swathi dixit eliminated from bigg boss house

బిగ్ బాస్… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీవరే పట్టుకుంది. ఎక్కడ చూసినా.. బిగ్ బాస్ గురించే చర్చ. నిజానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభంలో అంత జోష్ లేకున్నా.. రాను రాను ఈ షోకు పాపులారిటీ పెరిగింది. హౌస్ లో జరుగుతున్న గొడవలు, ప్రేమ జంటలు.. ఇంకా రకరకాలుగా ఏదేదో జరుగుతుండటంతో ప్రేక్షకులు కూడా షోకు కనెక్ట్ అవుతున్నారు.

swathi dixit eliminated from bigg boss house
swathi dixit eliminated from bigg boss house

ఇప్పటికే మూడు వారాలు అయిపోయాయి. ఇంకో రోజు అయితే నాలుగో వారం కూడా అయిపోతుంది. ఈ వారం బయటికి పోవడానికి నామినేట్ అయిన వాళ్లలో అభిజిత్, సొహైల్, మెహబూబ్, లాస్య, స్వాతి దీక్షిత్, దేత్తడి హారిక ఉన్నారు.

అయితే.. వీళ్లలో ఎవరు ఈసారి బయటికి వెళ్తారు.. అనే దానిపై బాగానే చర్చ నడుస్తోంది. చాలామంది మెహబూబ్ బయటికి వెళ్లిపోతాడని అంటున్నారు. మరికొందరైతే సొహైల్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాడు. మనోడిని పంపిచేద్దాం.. ఇంటికి అంటున్నారు.

అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ వారం బిగ్ బాస్ ఇంటిని బయటికి వెళ్లిపోయేది మరెవరో కాదు.. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ స్టార్ స్వాతీ దీక్షిత్. అవును.. వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే సర్దేసుకుంటోంది ఈ మిల్కీ బ్యూటీ.

swathi dixit eliminated from bigg boss house
swathi dixit eliminated from bigg boss house

నిజానికి స్వాతి హౌస్ లోకి వచ్చి వారమే అయినా.. తను చాలా రిజర్వుడుగా ఉంటోంది. అంతే కాదు.. తను ముందే బయట ఆట చూసి వచ్చి తనకు నచ్చిన వాళ్లతోనే ఉంటుంది. ఎక్కువగా తను అభిజిత్ తోనే హౌస్ లో గడుపుతోంది. అభిజిత్ కూడా ఎక్కువగా తనతోనే గడుపుతున్నారు. అఫ్ కోర్స్.. అభిజిత్, హారికది వేరే ట్రాక్ అనుకోండి.. వాళ్ల కథ వేరు కానీ.. స్వాతి మాత్రం అభిజిత్ తోనే కనెక్ట్ అవడంతో ఇప్పుడు స్వాతి వెళ్లిపోతే ఏంటి పరిస్థితి అని నెటిజన్లు అంటున్నారు.

మొత్తానికి వచ్చిన వారానికే స్వాతిని ఇంటి సభ్యులు ఇంటికి పంపించేస్తున్నారు. తను రాగానే ఆట మొదలు పెట్టినా.. తన ఆట జనాలను ఆకట్టుకోలేదు కాబోలు.. అందుకే తనకు ఎవ్వరూ ఎక్కువగా ఓట్లు వేయకపోవడంతో తను హౌస్ నుంచి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.