సీనియర్ హీరోయిన్ కు కూడా గుండెపోటు

బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో పనిచేసిన ఈమె.. విశ్వసుందరి కిరీటాన్ని కూడా అందుకుంది. అయితే ఓ వైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా వేధికంగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ.. తరచూ వార్తల్లో కూడా నిలిస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేధికగా ఓ షాకింగ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది.

తనకు కొన్ని రోజుల క్రితం మొదటి సారి గుండెపోటు వచ్చిందని వెల్లడించింది. సుస్మితా తన తండ్రితో ఉన్న ఓ ఫొటోను పెట్టి క్యాప్షన్ లో తన హృదయాన్ని సంతోషంగా, ధైర్యంగా ఉంచమని తన తండ్రి సుబీర్ సేన్ చెప్పారని అన్నారు. అభిమానులకు అవసరమైనప్పుడు అది ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చిందని.. ఆ తర్వాత యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారని.. తన గుండె పెద్దదని గుండె నిపుణుడు చెప్పినట్లు పేర్కొన్నారు.

అలాగే సరైన సమయంలో తనకు సహాయం చేసిన, సపోర్ట్ చేసిన చాలా మందికి తాను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు. అది వేరే పోస్టులో చెబుతానంటూ వివరించారు. ఈ పోస్ట్ ద్వారా అంతా బాగానే ఉందని, నేను మళ్లీ జీవితానికి సిద్ధంగా ఉన్నాననే శుభవార్తను తన శ్రేయోభిలాషులకు, ప్రియమైన వారికి తెలియజేయాలి అనుకుంటున్నట్లు వెల్లడించారు. తాను తన అభిమానులందరినీ ప్రేమిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సుస్మితా సేన్ యే స్వయంగా ఈ విషయం వివరించింది. ఆమె పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే విపరీతంగా వైరల్ అయింది. ఆమె ఫ్యాన్స్ అంతా ఏమైంది మీకంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఇన్ స్టా వేదికగానే సుస్మితకు 6.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. 1596 పోస్టులు చేసింది. సుస్మిత పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. స్ట్రాంగ్ ఉమెన్ అని కొందరూ.. మీరు నూరేళ్ల చల్లగా ఉండాలని మరికొంత మంది చెప్పారు. మీది పెద్ద గుండే కాదు.. బంగారం లాంటి గుండె అని కార్డియాలజిస్ట్ చెప్పడం మర్చిపోయారంటూ వెల్లడించారు. మీరు త్వరగా కోరుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ఓ నెటిజెన్ చెప్పుకొచ్చాడు.