బాలీవుడ్ లో ప్రకంపన సృష్టిస్తున్న హీరో సుశాంత్ మృతి కేసు రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ఏదో సమస్యతో ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఆయన కేసుపై ఎన్నో ట్విస్టులు వస్తున్నాయి.
సుశాంత్ సింగ్ చనిపోవడానికి కారణం తన ప్రియురాలు రియా చక్రవర్తి అని ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు.. సుశాంత్ సన్నిహితులు కూడా రియా మీదనే నేరం నెట్టారు. సుశాంత్ తల్లిదండ్రులు కూడా రియానే అనుమానించారు. దీంతో కేసును రియా కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు.
ముందుగా ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయింది. అయినప్పటికీ.. సుశాంత్ మరణానికి సంబంధించి ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు.
తర్వాత సీబీఐ రంగంలోకి దిగింది. రియా చక్రవర్తితో పాటు పలువురు సుశాంత్ సన్నిహితులను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఇంతలో రియా చక్రవర్తికి డ్రగ్స్ దందాకు ఏదో లింక్ ఉందని తెలిసింది. దీంతో రియాను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో రంగంలోకి దిగింది. ముంబైలో ఉన్న రియా చక్రవర్తి ఇంట్లో ఎన్సీబీ అధికారులు దాడులు చేయడం ప్రారంభించారు.
ముంబైలోని జుహు తారా రోడ్డులో ఉన్న రియా చక్రవర్తి ఇంటితో పాటుగా.. సుశాంత్ ప్రెండ్ శామ్యుల్ మిరిండా ఇంట్లో కూడా ఏకకాలంలో ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
సుశాంత్ మరణానికి డ్రగ్స్ కు, రియాకు మధ్య లింక్ దొరికిందంటే చాలు.. పోలీసులు వెంటనే రియాను అరెస్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. డ్రగ్స్ కు సంబంధించి వీళ్ల ఇంట్లో చిన్న ఆధారం దొరికినా చాలు.. రియా చక్రవర్తి జైలుకు వెళ్లాల్సిందే.
ఇక.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ మాఫియా దందాను నడుపుతున్న డ్రగ్ ట్రాఫికర్ కైజన్ ఇబ్రహీంను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే.. రియా, శామ్యుల్ ఇంట్లో డ్రగ్స్ ఉందని ఇబ్రహీం ఇచ్చిన సమాచారం మేరకే ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
కైజన్ ఇబ్రహీంతో పాటుగా ఎన్సీబీ అధికారులు డ్రగ్ డీలర్ బాసిత్ పరిహార్, జైడ్ విలాట్రాను అరెస్ట్ చేశారు. వీళ్లది పెద్ద డ్రగ్ రాకెట్ అని.. దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా విదేశాలకు సైతం వీళ్లు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.