సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ మాఫియా లింకులు ఉండటంతో నార్కోటిక్ కంట్రోలో బ్యూరో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సుశాంత్‌కు నిషేదిత డ్రగ్స్ ఇచ్చారన్న అనుమానంతో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, మేనేజర్ శ్యామూల్ మిరిండాను ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోదరి ఆదేశాలతోనే తాను సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చేవాడిని షోవిక్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియాను గత రెండు మూడు రోజులుగా ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్నారు.
ఎన్సీబీ అధికార వర్గాల సమాచారం ప్రకారం.. తాను మారిజువానా లాంటి నిషేధిత డ్రగ్స్ ఉపయోగించినట్టు రియా ఒప్పుకుందట. సోదరుడు షోవిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ సమకూర్చుకొనే దాన్ని అని అంగీకరించినట్టు తెలుస్తోంది. గతవార క్రితం షోవిక్, సుశాంత్ మేనేజర్ శ్యామ్యూల్‌ను అరెస్ట్ చేయడంతో ఆదివారం రియా చక్రవర్తి ఎన్‌సీబీ విచారణకు హాజరు కాగా నేడు ఆమెను అరెస్ట్ చేశారు. సుధీర్ఘ విచారణలో ఆమె మరి కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు కూడా చెప్పిందని తెలుస్తోంది.
రియా చక్రవర్తి తనకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది. రియా చక్రవర్తి అందించిన సమాచారం ఆధారంగా మరికొందరు బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా సుశాంత్ సింగ్ కేసులో రియా అరెస్ట్ అవ్వడం, డ్రగ్స్ వాడానాని, ఇచ్చానని అంగీరకరించడంతో అరెస్ట్ తప్పలేదు. ఇక సోషల్ మీడియాలో రియా చక్రవర్తిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.