రికార్డు రిలీజ్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన “సూర్య 42” పోస్టర్ టీజర్.!

హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం “ఈటి” తన కెరీర్ లో థియేట్రికల్ గా అంత సక్సెస్ అయితే కాలేదు. దీనితో ఈ చిత్రం తర్వాత చేసిన విక్రమ్ క్యామియో కి మాత్రం ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా తర్వాత కూడా వెట్రిమారన్ లాంటి తదితర స్టార్ నటులతో సినిమా ఓకే చేసిన సూర్య మొన్ననే నోటెడ్ దర్శకుడు శివ తో తన కెరీర్ లో 42వ సినిమాగా ఓ భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఇప్పుడు రివీల్ అయ్యింది.

అసలు ఊహించని రేంజ్ లో ఈ మోషన్ పోస్టర్ టీజర్ ఉందని చెప్పడంలో అసలు డౌట్ నే లేదు. రీసెంట్ టైం లో ఎన్టీఆర్ 30 కి వచ్చిన అనౌన్సమెంట్ టీజర్ తరహా లో సెన్సేషనల్ హై ఈ టీజర్ కూడా అందించింది. అయితే సూర్య 42 పోస్టర్ ఒక గ్రద్ద తో పీరియాడిక్ డ్రామా విజువల్స్ తో అదిరిపోయే లెవెల్లో కనిపిస్తుంది.

దీనితో తోడు ఈ వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఇంకో లెవెల్లో ఉండడం విశేషం. అయితే లాస్ట్ లో ఎన్టీఆర్ 30 కి ఎలా చూపించారో అదే టైప్ లో అనిపించింది కానీ మొత్తంగా అయితే ఈ టీజర్ ఒక్కసారిగా భారీ అంచనాలు పెంచేసింది.

దీనితో పాటుగా ఈ చిత్రాన్ని రికార్డు లెవెల్లో ఒకేసారి 10 భాషల్లో 3D లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ సెన్సేషన్ దిశా పటాని హీరోయిన్ గా ఫిక్స్ కాగా గ్రీన్ స్టూడియో వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.