Kanguva: సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ శివ దర్శకత్వంలో రూపొందుతుంది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కే.ఈ జ్ఞానవేల్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన ‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు చెప్పారు.
‘కంగువా’ను ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నిర్మాత ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తి చేయనున్నాం. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి.
Kanguva: నవంబర్ 14కు లాక్ చేసిన ‘కంగువా’
ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు. ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్ కోసం మేం దీన్ని ప్రయోగిస్తున్నాం. ఇది విజయవంతమవుతుందని భావిస్తున్నాం. ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల కానుంది. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తాం అని నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత ఇటీవల చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
నెట్టింట్ వైరల్‌గా కంగువా పోస్టర్లు!
కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ కథానాయిక. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.