అలా తప్పు చేసి దొరికింది.. సురేఖా వాణి కూతుర్ని ఆడేసుకుంటోన్న నెటిజన్లు!!

Sureska Vani Daughter Supritha Gets Trolling

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంటారో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి తన కూతురిని సోషల్ మీడియాలో బాగానే పాపులర్ చేసింది. ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లడం, కలిసి డ్యాన్సులు చేయడంతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇక అందంలో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ పోటీపడుతున్నారా? అనేంతగా రచ్చ చేస్తుంటారు. కూతురిలానే మోడ్రన్‌గా తయారై సురేఖా వాణి రచ్చ చేస్తూ ఉంటుంది.

Sureska Vani Daughter Supritha Gets Trolling
Sureska Vani Daughter Supritha Gets Trolling

తాజాగా సుప్రిత అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. అందులో తన అమ్మపై ఉన్న ప్రేమను చాటేలా ఉంది. ఈ మోడ్రన్ మమ్మీపై ముద్దులు కురిపిస్తూ.. ఓ కామెంట్ చేసింది. నా చివరి శ్వాస వరకు నాకు సంతోషం నీవల్లే అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో శ్వాస (Breath) స్పెల్లింగ్‌ను తప్పుగా (Breadth)గా రాసింది. దీంతో నెటిజన్లు ఆమెను ఆడుకున్నారు. అది కూడా తెలీదా అంటూ తెగ ట్రోల్ చేశారు. దీంతో తేరుకున్న సుప్రిత తన పోస్ట్‌ను ఎడిట్ చేసుకుంది.

Sureska Vani Daughter Supritha Gets Trolling
Sureska Vani Daughter Supritha Gets Trolling

ఇక తనను ట్రోల్ చేసిన వారందరికీ ఓ కౌంటర్ ఇచ్చింది. రెడీగా ఉంటారు కదా.. ఎవరు ఏం తప్పు చేస్తారు.. కామెంట్‌లో వేసుకుందాం అని.. మీరు ఏంటి ఇంగ్లీష్‌లో పీహెచ్‌డీ చేశారా? లేకపోతే ఆక్స్‌ఫర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారా? పెద్ద దండం రా బాబు మీకు.. కొంచెం లైఫ్‌లొ ఏదో ఒకటి చేయండిరా బాబు.. మా మీద పడి పోవడం కాకుండా.. అసలు నేను నచ్చలేదు అంటే ఇంక ఫాలో అవ్వడం ఎందుకు నన్ను.. చూడనీకా ఏం తప్పు చేస్తదో వేసుకుందామని కదా..చేంజ్ అవ్వండిరా కొంచెం అంటూ సుప్రీత పేర్కొంది. నెటిజన్ల ట్రోలింగ్‌కు సుప్రిత బాగానే హర్టైనట్టుంది.