నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి, సుప్రిత కలిసి వేసే టూర్లు, వీకెండ్‌లో చేసుకునే పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఈ ఇద్దరూ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్డంను ఎంజాయ్ చేస్తున్నారు. తెరపై కనిపించే సురేఖా వాణికి సోషల్ మీడియాలో ఉండే సురేఖా వాణికి ఎంతో తేడా ఉంటుంది. మోడ్రన్ మదర్‌కు ప్రతిరూపంగా ఉంటుంది. కూతురితో అందంలో పోటీ పడుతూ వస్త్రాధారణ చేస్తుంది.
సురేఖా వాణి అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో సుప్రితను ఎవ్వరూ కూడా అంతగా పట్టించుకోరు. అందంలో సురేఖా వాణినే పొగుడుతూ కామెంట్లు పెడుతుంటారు. కూతురి కంటే తల్లే అందంగా ఉందని కొంటె కామెంట్లు చేస్తుంటారు. తల్లీ కూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా షికార్లు కొడుతుంటారు. సోషల్ మీడియాలో వీరు చేసే రచ్చకు, ఫోటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. సుప్రిత కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది.
సుప్రితను నెటిజన్లు ఎక్కువగా ట్రోల్స్ చేస్తుంటారు. ఆ మధ్య స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయలేదని ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. ఇక తాజాగా సుప్రిత తన ఫాలోవర్లతో ఓ గేమ్ ఆడింది. ఎలాంటి ఫోటోను అడిగినా షేర్ చేస్తాను అని చెప్పింది. ఇక కొందరు ఇందులో క్రియేటివిటీని ప్రదర్శించారు. డీపీ, వాల్ పేపర్, ఇష్టమైన ఫోటో, ఈ ఏడాదిలో దిగిన మొదటి ఫోటో ఇలా రకరకాలుగా అడిగారు. ఇప్పటివరకు ఎవ్వరికీ చూపించని, ఎవ్వరూ చూడని ఫోటోను షేర్ చేయమని అడిగాడు. దీంతో తన అమ్మ, తాను ఎంతో స్టైలీష్‌గా రెడీ అయి దిగిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.