వైరల్ : గుండు లుక్ లో షాకిచ్చిన నటి సురేఖ వాణి

తెలుగు సినిమా దగ్గర ఉన్న కొందరి నటీనటుల్లో హీరోయిన్స్ కానప్పటికీ మంచి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉన్న సీరియల్ నటులు అలాగే కొందరు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. కాగా ఈ తరహా ఆర్టిస్ట్ లలో నటి సురేఖ వాణి కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మెయిన్ గా యూత్ లోని ఇంకా సోషల్ మీడియాలో కొందరు అంకుల్స్ లో ఆమె క్రేజ్ అయితే ఇంకా ఎక్కువ. మరి ఇలా సినిమాల్లోని ఇంకా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామ్ షో తో అదరగొట్టే సురేఖ వాణి లేటెస్ట్ గా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ కొత్త లుక్ తో షాకిచ్చింది.

జెనరల్ గా ఆడవాళ్ళకి ఆ పొడవైన జుట్టే అందం కానీ ఆమె మొత్తం క్లీన్ గా గుండు చేయించేసుకొని తన కొత్త లుక్ తో షాకిచ్చింది. కాగా ఆమె ఎందుకు ఇలా సడెన్ గా మారిందో మరి ఎవరికీ అర్ధం కాలేదు. పోనీ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయి అంటే ఏది లేదు.

అయితే ఆమె ఈ కొత్త సంవత్సరంలో కొంచెం చేంజ్ కోసం ఇలా మారినట్టుగా తెలుస్తుంది. కానీ ఈమెని ఇలా మాత్రం చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. ఇప్పుడు సురేఖ వాణి తెలుగు సహా తమిళ్ లో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది.