డాటర్స్ డే రోజున కూతురికి స్పెషల్ విషెస్ తెలియజేసిన సూపర్ స్టార్ మహేష్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో సార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబుకి ఉన్న లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ ఇతర హీరోకి కూడా లేదనటంలో సందేహం లేదు. ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నప్పటికీ తన ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ బాబుకి తన కూతురు సితారతో ఉన్న బాండింగ్ చాలా గొప్పది.

వీరిద్దరూ కలిసి ఎప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇటీవల బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కూడా మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి సందడి చేస్తున్నాడు. అలాగే జీ తెలుగులో ప్రసారమయ్యే కొత్త టీవీ సీరియల్స్ ప్రమోషన్స్ లో కూడా సితారతో కలసి కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా మహేష్ బాబు తన ప్రియమైన కూతురు సితారకి స్పెషల్ విషెస్ తెలియజేశాడు.

ఈ క్రమంలో మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా సితారకి డాటర్స్ డే విషెస్ తెలియజేస్తూ..నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారికి డాటర్స్ ​డే శుభాకాంక్షలు” అంటూ ఇన్‌స్టా లో
పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో మహేష్ బాబు సితార కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.