Sitara: రియల్ లైఫ్ లో నాన్న కూడా ముఫాసానే.. తండ్రిపై సితార ఆసక్తికర వ్యాఖ్యలు!

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు తన సినిమా ద్వారా బిజీ కానున్నారు ఇకపోతే మహేష్ బాబు కుమార్తె సితార గురించి అందరికీ తెలిసిందే. ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సితార సెలబ్రిటీగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు.

సితార ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఈమె భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసా పాత్రకి తన వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కావడానికి సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సితార ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ముఫాసా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ది లయన్ కింగ్ లో ముఫాసా పాత్ర ఐకానిక్ క్యారెక్టర్. ఇలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ కు నాన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం నేను చాలా గర్వపడుతున్నాను. నాన్న కూడా నిజ జీవితంలో ముఫాసా లాంటి వ్యక్తి.

నాన్న మమ్మల్ని కూడా సినిమాలో ముఫాసా తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తుందో అలా ప్రేమిస్తాడు. నాన్న ఈ సినిమా చేస్తున్నాడు అన్న వార్త విన్నప్పుడు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. నాన్న ముఫాసాగా నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఎంతో థ్రిల్ అవుతున్నానని సితార తెలిపారు. ఇలా ఈ సినిమా కోసం పనిచేయడానికి నాన్న ఎంతో కష్టపడ్డారని ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 20వ తేదీ డిసెంబర్ హాట్ స్టార్ లో ది లయన్ కింగ్ ముఫాసా తప్పకుండా చూడండి అంటూ ఈ సందర్భంగా సితార షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.