సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ పార్టీ ‘మక్కల్ సేవాయి కచ్చి’ గురించి జనవరి 1న అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. తలైవా రాజకీయ ప్రసంగం ఎలా ఉంటుందా అని దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి రజినీకాంత్ ద్వారా తమిళ ఎన్నికలు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారనున్నాయి.
ఇదిలావుండగా పార్టీని లాంచ్ చేయడానికి తలైవా ఒక రూట్ కూడా సెట్ చేసుకున్నారట. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఇక ఆపేదిలేదని ఒక రహదారి సెట్టయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ జనవరి 17న తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయ పట్టణం మదురైలో భారీ ర్యాలీలో రజిని తన పార్టీని ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. రజనీ తన పార్టీ ప్రారంభానికి జనవరి 17ను ఎంచుకోవడం వెనుక ఒక ప్రత్యేక కారణం అయితే ఉంది. అదే రోజునే దిగ్గజ తమిళ థెస్పియన్, మాజీ తమిళనాడు సిఎం ఎంజీఆర్ పుట్టినరోజు.
రజిని ఎంజీఆర్ కు గొప్ప అభిమాని కూడా.
ఇక ఆ సీనియర్ దగ్గజ నటుడిని ప్రేరణగా తీసుకొని వారసత్వానికి తగినట్లుగా ప్రయత్నిస్తున్నారని తమిళ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఎన్నికల కమిషన్ రజినీకాంత్ పార్టీకి ఆటోరిక్షా చిహ్నాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తలైవర్ పార్టీ తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆ ఎన్నికల్లో సూపర్ స్టార్ పార్టీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.