చాలా నిరాశ పడ్డాను.. ఆ పాత్ర చేయకుండా ఉండాల్సిందంటున్న కుష్బూ!

సినీ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు అప్పట్లో ఆమె ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. తమిళనాడులో ఆమెకి అభిమానులు కాదు భక్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె భక్తులు ఆమెకి ఏకంగా ఒక గుడిని కూడా నిర్మించడం విశేషం. ప్రస్తుతం సినిమాలలో కంటే రాజకీయాలలోనే ఎక్కువగా బిజీగా కనిపిస్తున్న కుష్బూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూకి హాజరైంది.

ఆ ఇంటర్వ్యూలో అనవసరంగా ఈ పాత్ర చేశాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం గా అలాంటి పాత్రలు చాలా చేశాను బాలీవుడ్ లో నేను చేసిన సినిమాలు చాలా తక్కువ కాబట్టి అలాంటి పాత్రలు బాలీవుడ్లో కాదు సౌత్ లోనే నాకు ఇష్టం లేని పాత్రలు చేశాను. అందులో ఒకటి ఒక స్టార్ హీరో తో చేసిన ప్రాజెక్ట్ ప్రారంభంలో ఉన్న అంచనాలను కుష్బూ వివరించింది. “ఈ చిత్రంలో మీనా మరియు నేను నటించాము మరియు మేమిద్దరం హీరోయిన్లుగా ఉంటామని మొదట్లో చెప్పబడింది.

రజనీ సార్‌ సరసన మరో హీరోయిన్ జోడీ ఉండదని, ఆద్యంతం మేం ఉంటామని, ఆయనతో డ్యూయెట్స్ ఉంటాయని నమ్మి ఈ ప్రాజెక్ట్‌కి అంగీకరించాను. ఇది చాలా హ్యాపీ-గో-లక్కీ, హాస్యాస్పదమైన మరియు వినోదభరితమైన పాత్ర” అని ఆమె వెల్లడించింది. రజనీ సర్‌కి అకస్మాత్తుగా ఒక హీరోయిన్ వచ్చింది అప్పుడు నాకు నా పాత్ర కామెడీ క్యారెక్టర్ గా అనిపించింది.

నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు సినిమాను చూసిన తర్వాత, నేను చాలా నిరాశకు గురయ్యాను,” అని కుష్బూ చెప్పారు. అయితే ఆమె సినిమా పేరు చెప్పకపోవడం గమనార్హం కానీ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు ఆమె రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా గురించి మాట్లాడుతుందని పసి కట్టేశారు. 2021లో విడుదలైన ఈ సినిమాలో కుష్బూ మీనా కీలకమైన పాత్రలు పోషించగా రజిని సరసన హీరోయిన్గా నయనతార నటించడం గమనార్హం.