ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసు దాదాపు ముగిసిన తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ మాసివ్ గెయిమ్‌తో తమ హై నోట్ క్లోజ్‌ను ఎంచుకుంది. దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 110 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇది ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఇది ఇప్పటివరకు ఎదురైన అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. గత సీజన్ లో ఫైనల్స్ లో SRH ను దెబ్బ కొట్టిన KKR పై రివెంజ్ అయితే తీర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో హెయిన్‌రిచ్ క్లాసెన్ (105 నాటౌట్, 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) తుఫానులా విరుచుకుపడ్డాడు. అతనితో పాటు ట్రావిస్ హెడ్ (76; 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (29; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 3 వికెట్లకు 278 పరుగుల భారీ స్కోరు చేశారు. క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, చివరికి శతకం సాధించి మ్యాచ్‌ను SRH ఆధీనంలోకి తీసుకొచ్చాడు.
కేకేఆర్ జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో అసమర్థంగా నిలిచింది. మొదట ఓపెనర్ సునీల్ నరైన్ (31) శుభారంభం ఇచ్చినా, ఆ తర్వాత వికెట్లు వరుసగా కోల్పోయారు. మనీష్ పాండే (37), హర్షిత్ రాణా (34 నాటౌట్) మాత్రమే కొంత పోరాడారు. కానీ ఆ మొత్తంతో భారీ లక్ష్యాన్ని చేరడం అసాధ్యమైంది. 18.4 ఓవర్లలో 168 పరుగులకు కేకేఆర్ ఆలౌట్ అయింది.
బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కట్ (3/24), ఎషాన్ మలింగ (3/31), హర్ష్ దూబె (3/34) తలా మూడు వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో కీలకంగా నిలిచారు. వారు కేకేఆర్ గుట్టు చిదిమేశారు. ఈ విజయం హైదరాబాద్‌కు ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం కూడా. ఈ విజయంతో SRH 14 మ్యాచ్‌లలో 6 విజయాలతో 13 పాయింట్లతో ముగించింది. ఇక కోల్‌కతా మాత్రం ఈ పరాజయంతో 8 స్థానంతో సీజన్ కు ఎండ్ కార్డ్ పెట్టేసింది. క్లాసెన్ శతకం, బౌలింగ్ దళం మ్యాజిక్‌తో సన్‌రైజర్స్ అభిమానులకు సీజన్‌ను మరిచిపోలేని ముద్రతో ముగించింది.

