Test Match: ఇంగ్లాండ్ టూర్‌కి భారత కొత్త టెస్ట్ టీమ్ సిద్ధం.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత, భారత టెస్ట్ జట్టు ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ తాజాగా 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్ హోదా లభించింది.

ఈ సందర్భంగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ, “విరాట్, రోహిత్ లాంటి అనుభవజ్ఞుల లేమి తప్పకుండా జట్టుకు లోటే. కానీ అదే సమయంలో యువ ఆటగాళ్లకు మంచి అవకాశంగా మారనుంది,” అని అన్నారు. ఆటగాడు ఎప్పుడు రిటైర్ అవాలనేది అతని వ్యక్తిగత నిర్ణయమేనని స్పష్టం చేసిన గంభీర్, కొత్త ప్లేయర్లపై విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంగ్లాండ్‌లో ఆడే ఈ సిరీస్‌తో భారత జట్టు టెస్ట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకనుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ క్రికెటర్లకు ఇది పెద్ద పరీక్ష. పంత్, బుమ్రా, జడేజా వంటి అనుభవజ్ఞుల బలమూ ఈ జట్టుకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అన్ని విభాగాల్లో బ్యాలెన్స్ ఉన్న జట్టునే బీసీసీఐ ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది.

ఇంగ్లాండ్ టూర్‌కు భారత టెస్ట్ జట్టు ఇలా ఉంది:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

కూటమికి మహిళల ఉసురు || EX IAS Vijay Kumar EXPOSED Pawan Kalyan & Chandrababu Ruling || Telugu Rajyam