సన్నీలియోన్ మీద మోజు తీరలేదా.?

మళ్ళీ ఓ తెలుగు సినిమాలో కనిపించబోతోందిట సన్నీలియోన్.! గతంలో ఆమెతో సినిమా చేసి చేతులు కాల్చుకున్న ఓ హీరో, ఇప్పుడామెను ఇంకోసారి సంప్రదించాడుట.

‘సాంతం బొక్కపడింది..’ అని అప్పట్లో సన్నీలియోన్ గురించి చెప్పుకున్నాడు ఆ హీరో బాహాటంగానే. ఏమయ్యిందో, ఆ సన్నీలియోన్ ఇంకోసారి కావాలంటున్నాడట. ‘తప్పదు, ఆమెను తీసుకుంటే ప్రాజెక్టుకి వచ్చే కిక్కే వేరప్పా..’ అన్నది సదరు హీరోగారి తాజా ఉవాచ అట.

ఎవరా హీరో.? ఏమా కథ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. సన్నీలియోన్ మాత్రం, తగినంత రెమ్యునరేషన్ ఇస్తే, అస్సలు మొహమాటపడదు. ఏ స్థాయి గ్లామర్ అయినా ఒలకబోసేస్తుంటుంది.

ఒకప్పుడు పోర్న్ స్టార్ కావడంతో.. సన్నీలియోన్‌కి ఎక్స్‌పోజింగ్ అంటే చాలా చాలా చిన్నమాట.! ఆ గ్లామరే ఆమెకు బోల్డన్ని అవకాశాల్ని తెచ్చిపెడుతోంది.