కాలితో ఎగిరి తంతోన్న సన్నీ లియోన్.. వీడియో వైరల్

Sunny Leone Fun With Co actor on set

కొంత మంది తారలు తెరపై ఎంత సందడిగా ఉన్నా నిజ జీవితంలో నిబ్బరంగా ఎంతో సీరియస్‌గా ఉంటారు. ఇంకొంత మంది తెరపై ఎంతో సీరియస్‌గా కనిపిస్తుంటారు కానీ రియల్ లైఫ్‌లో ఎంతో ఫన్నీగా ఉంటారు. ఇంకొందరు మాత్రం తెర ముందు తెర వెనకలా ఒకే విధంగా ఉంటారు. సన్నీ లియోన్ కూడా అదే రకానికి చెందిన తార అని తెలుస్తోంది. వెండితెరపై ఎంత సందడిగా ఉంటుందో సెట్లోనూ అంతే సందడి సందడిగా ఉంటుంది.

Sunny Leone Fun With Co actor on set
Sunny Leone Fun With Co actor on set

ఈ మధ్యే సన్నీ లియోన్ బిగ్ బాస్ స్టేజ్ మీద మెరిసింది. ఈ క్రమంలో స్టేజ్ మీదే సల్మాన్ ఖాన్‌తో కలిసి తన గొంతును అందరికీ వినిపించింది. సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలోని జగ్ గూమే అంటూ సన్నీ లియెన్ భయంకరంగా పాడేసింది. పక్కకే సల్మాన్ పాడుతూ ఉంటే.. సన్నీ వంత పాడింది. మొత్తానికి గొంతు ఎలా ఉన్నా కూడా సన్నీ లియోన్ ప్రయత్నం, ఆమె ఎగ్జైట్మెంట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సన్నీ లియోన్ మరోసారి నెటిజన్లు ఆకట్టుకుంది.

సెట్‌లో సన్నీ లియోన్ కుప్పి గంతులు వేసేసింది. ఎదుట ఉన్న వారిని కొడుతూ వెరైటీగా పంచ్‌లు ఇచ్చింది. కాలితో తంతూ సెట్ అంతా అల్లరి చేసింది. నాలా ఎవ్వరూ చేయరు కదా అంటూ ఓ కామెంట్ పెట్టేసింది. ప్రస్తుతం సన్నీ లియోన్ షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. లాక్డౌన్ సమయంలో సన్నీలియోన్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలోనే ఉంది. ఈ మధ్యే ఇండియాకు తిరిగి వచ్చింది. మళ్లీ ఇక్కడ తన ప్రాజెక్ట్‌లతో బిజీగా అయిపోయింది.