స్టార్ సన్నీలియోన్ అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. ప్రపంచం నలుమూలలా సన్నీలియోన్ అభిమానులుంటారు. అయితే సన్నీ మాత్రం కొన్ని కోట్ల మంది అభిమానులను అన్యాయం చేసింది. ఇండస్ట్రీని వదలిపెట్టి వెండితెరపై వెలిగాలనే నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టే ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సెక్స్ బాంబ్, ఐటెం గర్ల్‌గా సన్నీ లియోన్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె తెరపై పుట్టించే సెగ ఎప్పటికీ చల్లారదు. అయితే తెరపై కనిపించే సన్నీలియోన్‌కు రియల్ లైఫ్‌లో ఉండే సన్నీకి ఎంతో తేడా ఉంటుంది.
నిజ జీవితంలో సన్నీ లియోన్‌ది పెద్ద మనసు. అనాథలను దత్తత తీసుకుని.. సొంత పిల్లల్లా పెంచుకుంటుంది. పిల్లల కోసం తానే స్వయంగా వండి మరీ వడ్డిస్తుంది. ఆ మధ్య వెకేషన్‌కు వెళ్తే.. అక్కడే హోటల్‌లో తన పిల్లలకు ఇష్టమైన వంటకాలను స్వయంగా వండి మరీ పెట్టింది. అంతలా తన పిల్లలపై ప్రేమను కురిపిస్తుంది. లాక్డౌన్ సమయాన్ని సన్నీ లియోన్ అమెరికాలో గడిపేసింది. ఈ మధ్యే సన్నీ లియోన్ ఇండియాకు తిరిగి వచ్చింది.
అయితే సన్నీ లియోన్ మాత్రం ప్రస్తుతం షూటింగ్‌లో బిజీబిజీగా ఉంది. మరో వైపు తన కాస్మోటిక్స్ బిజినెస్ పనుల్లోనూ బిజీగా ఉంటోంది. అసలే ఇది పండుగ సీజన్ కావడంతో స్టార్ స్టక్ కాస్మోటిక్స్ ఆఫర్లను ప్రకటించింది. అయితే తారలు ఎంత బిజీగా ఉన్నా ఆదివారం మాత్రం ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ ఆదివారం మాత్రం సన్నీలియోన్ బాగా కష్టపడిందట. అందుకే అలా పడుకున్నానంటూ చెప్పుకొచ్చింది. వర్కింగ్ హార్ట్ ఆన్ సండే అంటూ అలా సోఫా మీద కునుకు తీసిన ఫోటోను షేర్ చేసింది.