ఓటిటి : ఫైనల్ గా “గాలోడు” స్ట్రీమింగ్..ఎప్పుడు ఎందులో అంటే.!

జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ సుడిగాలి సుధీర్ కోసం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తాను కమెడియన్ గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ లో కూడా నటుడుగా పలు సినిమాలు చేసాడు. అలా చిన్న చిన్న రోల్స్ నుంచి ఇప్పుడు తనకంటూ ఓ మార్కెట్ ని మరియు ఇమేజ్ ని సొంతం చేసుకొని ఆశ్చర్యపరిచాడు.

తాను లేటెస్ట్ గా చేసిన “గాలోడు” సినిమాతో అయితే ట్రేడ్ లో చాలా మందికి షాకిచ్చాడు. ఈ మధ్య కాలంలో పలువురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలకి కూడా రాని వసూళ్లు తాను రాబట్టి తన నిర్మాతలకి గాలోడు తో అయితే లాభాలు అందించాడు. కాగా ఈ సినిమాని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించగా..

యంగ్ హీరోయిన్ గేహన సిప్పి హీరోయిన్ గా సుధీర్ సరసన నటించింది. మరి ఈ సినిమా గత ఏడాది థియేటర్స్ లో రిలీజ్ కాగా ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ కి ఉండనుంది అంటే అది ఆహా తెలుగు ప్లాట్ ఫామ్ కాగా ఇందులో ఈ సినిమా ఈ ఫిబ్రవరి 17 నుంచి అయితే శివరాత్రి కానుకగా స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలిపారు.

దీంతో ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ అయితే సుధీర్ నుంచి వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ మాస్ ఎంటర్టైనర్ కి “ధమాకా” ఫేమ్ సంగీత దర్శకుడు భీమ్స్ సంగీతం అందించగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల నే సుధీర్ ని నమ్మి నిర్మాతగా కూడా వ్యవహరించారు.