Sudigali Sudheer: సుధీర్ నోరు విప్పాల్సిన టైం ఆసన్నమైంది.. మరి నిజం చెప్పనున్నారా?

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ అందరికీ ఎంతో సుపరిచితమే మిమిక్రీ ఆర్టిస్టు నుంచి హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు. ఇలా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమాలలో సందడి చేస్తున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఢీ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.ఇక ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ ఎందుకు హాజరు కాలేదు అనే విషయం గురించి ఎన్నో సార్లు ప్రశ్నలు వచ్చినప్పటికీ ఈ విషయంపై సుడిగాలి సుధీర్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు.

అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. మదర్స్ డే సందర్భంగా సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు ఎంతో హంగామా చేశారు. ఈ క్రమంలోనే నెటిజన్లు వీడియో ద్వారా తమ అభిమాన కమెడియన్ లను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు సుడిగాలి సుదీర్ ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా నెటిజన్లు వీడియో ద్వారా సుధీర్ ను ప్రశ్నిస్తూ.. అన్నా నువ్వు ఢీ కార్యక్రమంలో కనిపిస్తే ఎంతో బాగుంటుంది… అయినా ఢీ డాన్స్ షో నుంచి మీరు తప్పుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు.ఇలా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి కనుక సుధీర్ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి తప్పని సరిగా సమాధానం చెప్పాల్సివచ్చింది. మరి సుధీర్ ఢీ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో తెలియనుంది.