Sudheer: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుడిగాలి సుధీర్ ఎంగేజ్మెంట్ ఫొటోస్..?

Sudheer: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమెడియన్ గా, మెజీషియన్ గా, డాన్సర్ గా, హీరోగా ప్రతి రంగంలో కూడా తనదైన సత్తా చాటుతూ ఎంత మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఇకపోతే సుడిగాలి సుధీర్ పెళ్లి ఎప్పుడా అని అభిమానులతో పాటు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే మల్లెమాల వారు సుడిగాలి సుదీర్ కు ఈవెంట్ లో భాగంగా పలు సార్లు పెళ్లి చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా సుడిగాలి సుదీర్ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలో కూడా ఇలాగే పెళ్లి ఫొటోస్, రూమర్స్ వినిపించడంతో అదంతా స్కిట్ లో భాగమే అని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు కూడా ఇది ఒక స్కిట్ లో భాగమే అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ ఇంకొందరు మాత్రం ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిలా కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే సుధీర్ తన ప్రేయసిని పరిచయం చేసి ఉండొచ్చేమో అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.