స్ట్రాంగ్ ఇన్ఫో : “RC15” టైటిల్, ఫస్ట్ లుక్ ఆరోజే.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకులు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి అలాగే శంకర్ లతో వర్క్ చేసిన ఏకైక హీరోగా కూడా రామ్ చరణ్ నిలిచాడు. కాగా ఇప్పుడు శంకర్ తో సినిమా చేస్తుండగా ఇది రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా చేస్తున్నాడు.

దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై ఎప్పుడు నుంచి మెగా ఫ్యాన్స్ శంకర్ రామ్ చరణ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో అని చాలా ఆసక్తిగా ఉన్నారు. కాగా ఇది వరకే ఎన్నో అకేషన్ లు వెళ్లిపోగా ఇప్పుడు ఎట్టకేలకి ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఒక్క తెలుగు మీడియా నుంచి మాత్రమే కాకుండా తమిళ సినీ వర్గాల నుంచి కూడా గట్టి ఇన్ఫో అయితే ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రెండు కూడా ఈ మార్చ్ 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారట.

మరి దీనికి కూడా శంకర్ భారీ ప్లానింగ్స్ ఏమన్నా ఉంటాయో లేదో చూడాలి. ప్రస్తుతం ఇదే టాక్ సినీ వర్గాల్లో ఆసక్తిగా నడుస్తుంది. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.