ఆదిపురుష్ అసలు కథ మొదలైంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రానికి ఎవరేజ్ టాక్ వస్తోంది. కొందరు బాగుందని అంటూ ఉంటే మరికొందరు మాత్రం రామాయణాన్ని వక్రీకరించారని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ,మిక్సడ్ రెస్పాన్స్ తో నడుస్తోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదటి మూడు రోజులు చాలా వరకు థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి.

త్రీడీలో ఆదిపురుష్ సినిమా చూడటానికి చాలా మంది ఆసక్తి చూపించారు. రామాయణం పాయింట్ నుంచి బయటకి వచ్చి చూస్తే సినిమాకి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. ఇక మొదటి రోజు రోజులు వంద కోట్లకి పైగా గ్రాస్ ని సాధించడంతో ప్రేక్షకుల స్పందనతో సంబంధం లేకుండా రాబడి భాగానే ఉంది. ఇక ఆదివారం కూడా హైదరాబాద్ నెక్సస్ మాల్ లో 75 శాతం ఆక్యుపై అయ్యింది. అలాగే ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 21 షోలలో 75 ఆక్యుపెన్సీ వచ్చింది.

మల్టీప్లెక్స్ చైన్ లలో కూడా చాలా షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్, అలాగే 2డి ప్రదర్శితం అవుతున్న చోట్ల ఆదరణ కొంత తగ్గింది. అయితే వీకెండ్ పూర్తికావడంతో సోమవారం నుంచి ఆదిపురుష్ కి ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయనేది చూడాలి. సోమవారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

అలాగే న్యూట్రల్ థాట్స్ తో ఎక్కువగా సినిమాని చూడటానికి వచ్చేవారు ఉంటారని. అలాంటి వారు కచ్చితంగా మూవీని ఆదరిస్తారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మూవీకి వచ్చిన పబ్లిక్ టాక్ నేపథ్యంలో ఒటీటీలో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చు అని ఫ్యామిలీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరి ఎవరి అభిప్రాయాలు ఆదివారం కూడా వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన బ్రేక్ ఎవెన్ అందుకోవాలంటే సినిమా 500 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దానిని అందుకోవాలంటే సోమవారం నుంచి వచ్చే ప్రేక్షకాదరణ మీద ఆధారపడి ఉంటుంది.