ఇంకా జబర్దస్త్ ఆర్టిస్ట్‌గానే గుర్తింపు.. పాపం అవినాష్!

Still Avinash Recognized as Jabardasth Artist

ఒకప్పుడు జబర్దస్త్ అవినాష్ అంటే బాగానే సంబరపడేవాడేమో. కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ అంటూ ఆ పక్కనే తన పేరు పెట్టి పిలిస్తే ఏదో ఒక రకమైన ఫీలింగ్‌కు గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అవినాష్ ఇప్పుడు స్టార్ మా చానెల్‌కు కట్టప్పలా మారిపోయాడు. బిగ్ బాస్ షో ఆఫర్ ఇచ్చి.. అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి.. ఆ తరువాత మళ్లీ ఎక్కడా ఏ షో కూడా దొరక్కపోయినా స్టార్ మానే కొత్త షోతో అవకాశం ఇచ్చింది.

Still Avinash Recognized as Jabardasth Artist

కామెడీ స్టార్స్ అంటూ కొత్త షోతో అవినాష్‌కు మళ్లీ లైఫ్ ఇచ్చింది స్టార్ మా. అందుకు ఇప్పుడు అవినాష్ తాను జబర్దస్త్ ట్యాగ్ నుంచి బయటకు వచ్చేందుకు బాగానే కష్టపడుతున్నాడు. అయితే అవినాష్‌ను ఇంకా జబర్దస్త్ ఆర్టిస్ట్‌గానే గుర్తించే వారు కోకొల్లలు. మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా అవినాష్‌ను జబర్దస్త్ ఆర్టిస్ట్‌గానే గుర్తిస్తున్నారు. తాజాగా అవినాష్ ఇన్ స్టాలో లైవ్ వచ్చాడు. అందులో తన అభిమానులను యాడ్ చేసి కాసేపు ముచ్చట్లుపెట్టారు.

అయితే ఇందులో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోంచే ఉన్నారు. అయితే అందులో ప్రతీ ఒక్కరూ జబర్దస్త్ అవినాష్ అంటూ సంబోధించడం, జబర్దస్త్ షో చూస్తామని చెప్పుకొచ్చారు. అలా ప్రతీసారి జబర్దస్త్ గురించి వస్తుండటంతో.. తన కొత్త షో కామెడీ స్టార్స్ గురించి ప్రమోట్ చేసుకోవడంప్రారంభించాడు. అందరికీ తన కొత్త షో గురించి వివరించి చెప్పుకొంటూ వచ్చాడు. కానీ జబర్దస్త్ ట్యాగ్ వదిలించుకోవడం అంత సులభమేమీ కాదు.