సోషల్ మీడియా అభిమానులని, సెలబ్రిటీలని చాలా దగ్గర చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఇరువురు భావాలని పంచుకుంటూ వస్తున్నారు. అభిమానుల అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు స్పందిస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. అంతేకాక సినిమా, పర్సనల్ విషయాలని షేర్ చేస్తూ వారిలో ఆనందాన్ని నింపుతున్నారు. ఇంకొందరు సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్ట్‌లతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితంలో ఓ భాగం కాగా, వాటిని కొందరు హ్యాకర్స్ హ్యాక్ చేస్తూ ఇబ్బందులకి గురి చేస్తున్నారు.
గతంలో చాలా మంది సెలబ్రిటీల సామాజిక మాధ్యమాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. నిపుణుల సాయంతో తిరిగి వాటిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. తాజాగా ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రకటన ద్వారా తెలియజేసింది వరలక్ష్మీ. నిన్న రాత్రి రా రెండు అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇప్పటికీ కూడా వాటిని యాక్సిస్ చెయ్యలేకపోతున్నాను. సాధ్యమైనంత త్వరలో తిరిగి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఇటు మీడియా, అటు ఫాలోవర్స్‌కు నాదొక విన్నపం. నా అకౌంట్స్ నుండి ఎలాంటి మెసేజెస్ వచ్చినా కూడా స్పందించవద్దు.
నా అకౌంట్స్ తిరిగి నా అధీనంలోకి రాగానే మీకు తెలియజేస్తాను.త్వరలోనే మళ్ళీ ఆన్‌లైన్‌లో కలుద్దాం అని వరలక్ష్మీ పేర్కొన్నారు. . ప్రస్తుతం ఈమె తెలుగులో మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న “క్రాక్” లో ఒక కీలక రోల్ చేస్తున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు విలనిజం ఉన్న పాత్రలని చక్కటి న్యాయం చేస్తున్న వరలక్ష్మీ మంచి సామాజిక స్పృహ ఉన్న నటి. కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చి రియల్ హీరోయిన్ అనిపించుకుంది.