వామ్మో.. కాజల్ అగర్వాల్ సినిమాల ద్వారా అన్ని కోట్ల రూపాయలు సంపాదించారా?

తెలుగులో వేగంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అందాల చందమామగా ప్రేక్షకుల్లో గుర్తింపును సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ కు సినిమాసినిమాకు క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. హీరోయిన్ల లైఫ్ స్పాన్ తక్కువే అయినా కాజల్ అగర్వాల్ ఎక్కువ సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.

ఈ ఏడాది విడుదలైన ఆచార్య సినిమాలో కాజల్ పాత్ర ఉంటుందని భావించిన అభిమానులు సినిమా నుంచి ఆమె పాత్రను తీసేయడంతో తెగ ఫీలయ్యారు. ఒకవైపు సీనియర్ హీరోలతో మరోవైపు యంగ్ జనరేషన్ హీరోలతో కాజల్ అగర్వాల్ కలిసి నటించడం గమనార్హం. ముంబైలో జన్మించిన కాజల్ మాస్ మీడియా స్పెషలైజేషన్ ఇన్ ఎడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుంచి కాజల్ కు సినిమాలు, డ్యాన్స్ పై కొంతమేర ఆసక్తి ఉండేది.

కాలేజ్ లో చదువుకునే సమయంలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ క్యూను హో గయానా మూవీతో వెండితెరపై కెరీర్ ను మొదలుపెట్టారు. తెలుగులో లక్ష్మీ కళ్యాణం కాజల్ అగర్వాల్ నటించిన తొలి సినిమా కావడం గమనార్హం. తెలుగులో తొలి సినిమాకు దాదాపుగా పాతిక లక్షల రూపాయలు కాజల్ రెమ్యునరేషన్ గా అందుకున్నారు. ఆ సినిమా సక్సెస్ సాధించకపోయినా కాజల్ కు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం కాజల్ అగర్వాల్ ఆస్తుల విలువ 80 కోట్ల రూపాయలుగా ఉంది. ఇతరులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తన వంతుగా సహాయం చేసే విషయంలో ఈమె ముందువరసలో ఉంటారు. సినిమాసినిమాకు కాజల్ అగర్వాల్ కు క్రేజ్ పెరుగుతుండగా కొత్త ప్రాజెక్ట్ లకు కాజల్ ఆగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కాజల్ అగర్వాల్ అభిమానులు తెగ ఫీలవుతున్నారు.