చాన్నాళ్ళ క్రితం ‘ఉప్పెన’.. మొన్నేమో ‘దసరా’.. నిన్నేమో ‘విరూపాక్ష’.. ఈ మూడు సినిమాలూ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు తెరలేపాయి.
అంతేనా, కొత్త వివాదాలకూ ఆస్కారమిస్తున్నాయ్. ఆ మూడు సినిమాలు తీసిందీ సుకుమార్ శిష్యులే. శిష్యులంటే గురువు గర్వపడేలా వుండాలి.! ఔను, సుకుమార్ శిష్యులు తమ గురువు గర్వపడేలా చేస్తున్నారు.
మరి, సోకాల్డ్ స్టార్ డైరెక్టర్లలో అగ్రగణ్యులైనవారెందుకు అలా గర్వపడలేకపోతున్నట్టు.? ఆ సోకాల్డ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ పట్ల కొంత ఈర్ష్య ప్రదర్శిస్తున్నారట ఇప్పుడు. నిజానికి, సుకుమార్ అజాతశతృవు.
ఆయనకి ఎవరూ శతృవులు వుండరు. కానీ, సుకుమార్ శిష్యులు ఎదుగుతోంటే, సుకుమార్‌కి శతృవులు తయారవుతున్నారట. ఎవరా శతృవులు.? ఏమా కథ.? నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా.!