RRR: 12 సార్లు చూసినా మళ్ళీ ఆర్ఆర్ఆర్ చూడాలనుంది… !

RRR: ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సందడి చేయబోతోంది. ఈ సినిమా గురించి ఆ చిన్న వార్తయినా అలా వైరల్ అయిపోతోంది. ఇక నిన్న సినిమా ప్రముఖుల కోసం ప్రత్యేక షో వేశారు. దీంతో సినిమా చూసిన వాడు వారి అభిప్రాయాలను తెలపడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఫ్యాన్స్ లో ఉత్కంఠ ఇంకా పెరిగిపోయింది.

సినిమా ఎలా ఉందొ..? తమ అభిమాన నటులు ఏ రేంజ్ లో నటించారో..? రాజమౌళి సినిమాను ఎలా తెరకెక్కించారో..? ఫస్ట్ డే ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. చూడాలని యావత్ సినీ లోకం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఒకటి రెండు కాదు ఏకంగా 12 సార్లు చూశానని..అయినప్పటికీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది తెలిపి ఆనందం నింపారు ఆర్ఆర్ఆర్ విఎఫ్ఎక్స్ హెడ్ శ్రీనివాస మోహన్.

కొద్దిరోజుల క్రితమే సినిమాపై ఉత్కంఠగా ట్వీట్ చేసిన ఆయన తాజాగా మరోసారి సాలిడ్ ట్వీట్ చేసి ఆసక్తి నింపారు. అన్ని ఫార్మాట్లలో సినిమాను 12 సార్లు చూశానని మరియు పెద్ద స్క్రీన్‌పై మళ్లీ మళ్లీ చూడటానికి ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. RRR మూవీ, ఆర్ఆర్ఆర్ రిపీట్ మోడ్ ఆన్‌లో ఉంది. బిగ్ స్క్రీన్‌పై ప్రతి ఫార్మాట్‌లో 12 సార్లు చూశాను, ప్రతి వీక్షణతో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రేక్షకుల స్పందన చూడటానికి వేచి ఉండలేము అని, 12 గంటల సమయం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. #RRRFromTomorrow హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.