మొత్తం కూనీ చేసేశారు.. గల్లీబాయ్స్ గ్యాంగ్‌తో శ్రీముఖి రచ్చ!

అదిరింది షోలో గల్లీబాయ్స్ గ్యాంగ్ చేసే రచ్చ అందరికీ తెలిసిందే. అందులో సద్దాం అనే వ్యక్తి సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో బాగానే ఫేమస్ అయ్యాడు. తనను తాను హైపర్ ఆది రేంజ్‌లో పోల్చుకోవడంతో బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. పటాస్ స్టేజ్ నుంచి అదిరిందిలోకి వచ్చి బాగానే గుర్తింపు సంపాదించుకున్నాడు సద్దాం. అయితే ఎప్పుడూ ఒకే విధమైన కామెడీ చేస్తాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు.

Srimukhi Fun With Saddam And Yadamma raju
Srimukhi Fun With Saddam And Yadamma raju

ఇక ఈ గల్లీ గ్యాంగ్‌లో యాదమ్మ రాజు కూడా బాగానే ఫేమస్. పటాస్ వేదిక మీద లేడీ గెటప్పులు వేస్తూ తెలంగాణ యాసలో కామెడీ చేస్తుంటాడు. ఇతను కూడా అదిరింది షోతో బాగానే ఫేమస్ అయ్యాడు. వినాయక చవితికి చేసిన బాపు బొమ్మకు పెళ్లంటా అనే ఈవెంట్‌తో తన ప్రియురాలిని పరిచయం చేయడంతో మరింత క్రేజ్ సంపాదించాడు. స్టేజ్ మీదే రొమాన్స్ చేసి అదరగొట్టేశాడు. తాజాగా ఈ గ్యాంగ్‌తో శ్రీముఖి తోడైంది.

Srimukhi Fun With Saddam And Yadamma raju
Srimukhi Fun With Saddam And Yadamma raju

వీరంతా తాజాగా ఓ ఈవెంట్‌లో సందడి చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీముఖి సద్దాం గ్యాంగ్‌తో రచ్చ చేసింది. పాటలను పాడుత దారుణంగా కూనీ చేశారు. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను సద్దాం దారుణంగా పాడటంలో అక్కడున్న వారంత పగలబడి నవ్వేశారు. ఇక యాదమ్మ రాజు కూడా ఓ పాటను దారుణంగా చంపేశాడు. వీరు అలా పాడుతుంటే శ్రీముఖి వీడియో తీస్తూ పకపక నవ్వేసింది.