విడాకుల వార్తలపై స్పందించిన శ్రీకాంత్… ఆ వార్తలకు చెక్ పెట్టినట్లేనా?

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.శ్రీకాంత్ ఊహ ప్రేమించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే వీరిద్దరి మధ్య ఆర్థికపరమైన విషయంలో కొన్ని మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ వార్తల గురించి నటుడు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విడాకులు వార్తలు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇవన్నీ కూడా ఒట్టి పుకార్లు మాత్రమేనని ఈయన కొట్టి పారేశారు. ప్రస్తుతం తాను పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నానని,తనకు ఊహకు మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవు ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ ఈ సందర్భంగా విడాకుల వార్తలకు శ్రీకాంత్ చెక్ పెట్టారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న శ్రీకాంత్ ఊహ విడాకులు తీసుకోబోతున్నారని తెలియగానే ఒక్కసారిగా ఆందోళన పడ్డ అభిమానులు శ్రీకాంత్ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వడంతో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు.ఇక ఊహ శ్రీకాంత్ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా ఇప్పటికే తన కుమారుడు రోషన్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై మంచి గుర్తింపు పొందారు.త్వరలోనే తన కుమార్తె కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రాబోతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయం గురించి శ్రీకాంత్ ఊహ దంపతులు అధికారికంగా వెల్లడించలేదు.