బిగ్‌బాస్‌లో ఉండుంటే.. వారి సంగతి చెప్పేదాన్ని : శ్రీ రెడ్డి

Sri Reddy says that Bigg Boss 4 Telugu Contestants EMotion Is fake

బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీ రెడ్డి.. ఆ ఊహే ఎంత బాగుందో కదా? కానీ అదెప్పటికీ జరగదు. ఎందుకంటే శ్రీరెడ్డి లోపలికి వెళ్తే ఎంతమంది జాతకాలను బయటకు తీస్తుందో? ఎవరిపై ఎలా నోరు పారేసుకుంటుందో అని అందరి భయం. అందుకే శ్రీ రెడ్డి అంటే బిగ్‌బాస్ సైతం ఆమడ దూరం పారిపోతాడేమో. ఎందుకొచ్చిన గోలరా నాయన అనుకుని శ్రీరెడ్డిని టచ్ చేయడు బిగ్‌బాస్. తాజాగా శ్రీరెడ్డి బిగ్‌బాస్ నాల్గో సీజన్‌పై కామెంట్స్ చేసింది.

Sri Reddy says that Bigg Boss 4 Telugu Contestants EMotion Is fake
Sri Reddy says that Bigg Boss 4 Telugu Contestants EMotion Is fake

శ్రీ రెడ్డి తాజాగా లైవ్‌లో మాట్లాడుతూ బిగ్‌బాస్, అందులోని కంటెస్టెంట్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనకు అసలు బిగ్‌బాస్ షో అంటేనే నచ్చదని ఓ పెద్ద బాంబ్ వేసింది. అంతేకాకుండా కంటెస్టెంట్లందరూ ఫేక్ ఎమోషన్స్ చూపిస్తారని కౌంటర్ వేసింది. ఇక లైవ్‌లో అభిమానులు అడిగిన మరిన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చింది. ఒకవేళ బిగ్‌బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావా? అని అడిగితే ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.

Sri Reddy says that Bigg Boss 4 Telugu Contestants EMotion Is fake
Sri Reddy says that Bigg Boss 4 Telugu Contestants EMotion Is fake

బిగ్‌బాస్ అవకాశం వస్తే వెళ్తానని, ఒకవేళ తాను బిగ్‌‌బాస్ హౌస్‌లో ఉంటే.. కంటెస్టెంట్ల అసలు స్వరూపాలను బయటకు తీసుకొచ్చేదాన్ని, ఫేక్ ఎమోషన్స్ కాకుండా రియల్ ఎమోషన్స్‌ను అందరికీ చూపించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. కానీ శ్రీరెడ్డికి ఆ ఛాన్స్ రావడం కల్ల. బిగ్‌బాస్‌లో శ్రీ రెడ్డి ఉంటే అది కచ్చితంగా ఓ సెన్సేషన్ అవుతుంది. ఇక టీఆర్పీలో కొత్త శకం మొదలవుతుందనేది నిర్వివాదాంశం.