పతిత్తులా కథలు చెప్పింది.. రకుల్‌ ప్రీత్‌పై శ్రీ రెడ్డి ఫైర్

Sri Reddy Satires on Rakul Preet ABout Drugs Case

డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరి జాతకాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్, శాండల్ వుడ్‌లో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. అసలు టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఆ మధ్య సంచలనం సృష్టించి మరుగున పడింది. ఇక ఇప్పుడు మళ్లీ పునాదులు కదిలేట్టు కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని విచారించిన పోలీసులకు రకుల్‌తో సంబంధాలున్నట్టు తెలిశాయి.

Sri Reddy Satires on Rakul Preet ABout Drugs Case
Sri Reddy Satires on Rakul Preet ABout Drugs Case

ఇక రకుల్ ప్రీత్ సింగ్‌ పేరు బయటకు రావడంతో మరి కొంత టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రానా, మంచు లక్ష్మీ కూడా ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఇది కాసేపు పక్కనబెడితే.. తాజాగా శ్రీరెడ్డి ఈ విషయంపై స్పందించింది. నాడు నేను క్యాస్టింగ్ కౌచ్, డ్రగ్స్ గురించి మాట్టాడితే.. రకుల్ పత్తిత్తులా మీడియాతో అలాంటివి లేవని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్, నటీనటులను కించపర్చడం వంటివి జరగవని రకుల్, మంచు లక్ష్మీ రెచ్చిపోయారని తెలిపింది.

Sri Reddy Satires on Rakul Preet ABout Drugs Case
Sri Reddy Satires on Rakul Preet ABout Drugs Case

కర్మ ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు.. చేసిన పాపాలన్నీ కట్టకట్టుకుని వస్తాయి.. వారు వీరు అని తేడా ఉండదు.. అది ఐటీ రైడ్స్ కావచ్చు, డ్రగ్స్ కేసులో కావచ్చు.. కరోనా కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా అనుభవిస్తుంటారు.. పాపాలు ఊరికేపోవు.. నాకు రావాల్సిన చెడ్డ పేరు ఎలాగో వచ్చింది.. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అంటూ రకుల్ ప్రీత్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. చూడాలి ఇక ఈ డ్రగ్స్ కేసులో ఇంకెంత మంది బయటకు వస్తారో మరి.