శ్రీ రెడ్డి సంగతి తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. టాలీవుడ్‌ను మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఓ కుదుపు కుదిపేసింది. టాలీవుడ్‌లో ఎంతో మంది సెలెబ్రిటీల అమ్మాయిలను వాడుకున్నారంటూ, అవకాశాల పేరటి మోసం చేశారని అప్పట్లో ఓ ఉద్యమాన్ని లేవనెత్తింది. ఇక ఈ క్రమంలోనే దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరాం గుట్టును బయటపెట్టింది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేసింది.
ఇక ఆ ఉద్యమం మంచి ఊపులో ఉండగానే.. ఆర్జీవీ సలహా మేరకు పవన్ కళ్యాణ్‌ను బహిరంగంగా మీడియా ముందే దూషించింది. ఈ దెబ్బతో అప్పటి వరకు వచ్చిన సింపతీ మొత్తం పోయింది. పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించడంతో మీడియా సైతం శ్రీ రెడ్డిని పక్కనపెట్టాల్సి వచ్చింది. ఇక ఈ వివాదం తరువాత శ్రీ రెడ్డి చెన్నై వెళ్లి సెటిలైంది. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ యూట్యూబ్‌లో వంటల ప్రోగ్రాంలు చేసుకుంటోంది.
అవసరమైనప్పుడు మాత్రం సోషల్ మీడియాలోకి వచ్చిన దుమ్ము లేపుతోంది. ఇక ఆమె మాటలు, ఆమె ఒక్కోసారి చేసే దారుణమైన కామెంట్లు, షేర్ చేసే ఫోటోలను ప్రచురించడానికి కూడా వీలుండదు. తాజాగా శ్రీరెడ్డి నయనతారలా మారిపోయింది. తన మేకప్‌మేన్ చేసిన మాయ అంటూ తాను ప్రస్తుతం ఓ సెలెబ్రిటీలా ఉన్నాను అదెవరో చెప్పుకోండి చూద్దాం అంటూ ఓ క్విజ్ పోటీ పెట్టింది. నయనతారలా ఉన్నావని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మేకప్‌మేన్ ప్రతిభకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అయినా ఇప్పుడు ఇలా నయన్‌లా మేకప్ వేసుకోవడం వెనుక గల మర్మం ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.