సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య విషయంపై శ్రీరెడ్డి ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో శ్రీ రెడ్డి అమ్మాయిలకు ఇచ్చిన సలహాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఎవరో కాదన్నారని ఎందుకు చనిపోతున్నారు.. పేరెంట్స్‌ను ఎందుకు బాధ పెడుతున్నారని ఫైర్ అయింది. ఇక శ్రావణి విషయం మాట్లాడుతూ. ఆమె చాలా అమాయకురాలిగా కనిపిస్తోంది.. ఎమోషనల్‌గా వీక్ అని తెలుస్తోందని చెప్పుకొచ్చింది.
మోసం చేసే అబ్బాయిల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు.. వారు కాదంటే ఎందుకు చనిపోతున్నారు.. ఒంటరిగా పుట్టారు.. ఒంటరిగా పోతారు.. ఒంటరిగా బతకలేరా అంటూ ప్రశ్నించింది. ఒక జీన్స్ పాయింట్ కొనలాంటే వందసార్లు ఆలోచిస్తాం.. హెయిర్ బ్యాండ్ కొనాలంటే కూడా వందసార్లు ఆలోచిస్తాం.. అలాంటి కాబోయే వాడు.. బాయ్ ఫ్రెండ్, భర్త, జీవిత భాగస్వామి గురించి కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని సలహా ఇచ్చింది.
సాయి దేవరజ్ మా కమ్యూనిటీ పరువు దీశారు.. వారి గురించి చెప్పాలంటేనే సిగ్గువేస్తోంది.. సాయి మొదట ప్రేమించాడు.. ఎందుకు వెళ్లిపోయాడు.. మళ్లీ ఎందుకు వచ్చాడు. దేవరాజ్‌కు ఎన్ని రకాలుగా సాయం చేసింది కనీసం విశ్వాసం ఉండొద్దా? వారిద్దరినీ ఎన్ కౌంటర్ చేసి పడేయాలి అంటూ ఓ రేంజ్‌లో శ్రీరెడ్డి ఫైర్ అయింది.