కంగనా రనౌత్ పై శివాలెత్తిన శ్రీరెడ్డి!!

sri reddy fires on bollywood actress kangana ranaut

ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా కంగాన, మహారాష్ట్ర మంత్రి సంజయ్ రౌత్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. కంగనా రనౌత్ ను మహారాష్ట్ర వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేయడం వాటికి అంతే ధీటుగా కంగనా రనౌత్ కూడా నిలబడి కౌంటర్లు వేస్తోంది. ముంబైలో అడుగుపెట్టనీయం, రాళ్లతో కొట్టి చంపిస్తాం అంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపగా.. కంగనా రనౌత్ ఇచ్చిన కౌంటర్ మరింత వివాదంగా మారింది.

Sri Reddy fires On Bollywood actress Kangana Ranaut

ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే మహారాష్ట్రలోకి అడుగుపెట్టకు అంటూ కంగనాను హెచ్చరించాడు సంజయ్ రౌత్. మహారాష్ట్ర ఏమైనా పాక్ ఆక్రమిత కాశ్మీరా?, ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే అక్కడి రాకూడదా? మిమ్మల్ని విమర్శిస్తే వచ్చే హక్కు ఉండదా? అయితే మహారాష్ట్రకు వస్తున్నాను, ముంబైలో అడుగుపెడతాను ఏం చేస్తారో చూస్తాను అని కంగనా రనౌత్ సమాధానం ఇచ్చింది.

sri reddy fires on bollywood actress kangana ranaut

ఇలా వీరిద్దరి మధ్యలో మాటల యుద్దం జరుగుతూ ఉంటే శ్రీ రెడ్డి తన ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కంగనాకు తల పొగరు, ఎప్పుడూ అంతే వరెస్ట్, నీకు మహారాష్ట్ర వల్ల కోట్లు వచ్చాయ్, క్రేజ్ వచ్చింది.. లగ్జరీ లైఫ్ వచ్చింది.. ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. ఐ లవ్ ముంబై.. గ్రేట్ శివాజీ మహారాజ్ అంటూ శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ మరో వివాదానికి తెరదీసేలా ఉంది.