శ్రీముఖి అలాంటి పాత్రలోనా.. క్రేజీ అంకుల్స్ అంటూ రచ్చ

Sreemukhi Crazy uncles Trailer Out

శ్రీముఖి హీరోయిన్‌గా క్రేజీ అంకుల్స్ అనే ఓ చిత్రం రాబోతోంది. భరణి, రాజా రవీంద్ర, సింగర్ మనో చిలిపి పనులు చేసే క్రేజీ అంకుల్స్‌లా.. వారి భార్యలను కాకుండా యవ్వనంలో ఉన్న శ్రీముఖిని చూసి ఫిదా అవుతుంటారు. ఒక్కప్పుడు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శివాజీ వంటి వారితో కలిసి సినిమా కూడా వచ్చింది. తమ భార్యలను పట్టించుకోకపోవడం, తప్పుదారి పట్టి వేరే అమ్మాయి చుట్టూ తిరగడం వంటివి చేస్తుంటారు.

Sreemukhi Crazy uncles Trailer Out

20లో చేయాల్సిన పనులు 50లో చేసే అంకుల్స్‌గా మనో, రాజా రవీంద్ర, భరణిలు బాగానే నటించారు. ఇక సీరియల్ నటి, హోస్ట్, యాంకర్‌లు కార్లు, ఇళ్లులు ఎలా కడతారు.. ఇలా సైడ్ ఇన్‌కంతోనే కడతారు అంటూ చెప్పే డైలాగ్‌లు.. ఇక మేడమ్ అంటూ శ్రీముఖిని బుక్ చేసుకునే టైంలు, ఆ ముగ్గురిని ఒకే సారి శ్రీముఖి బుక్ చేసుకోవడం, శ్రీముఖిని పడేయడానికి వారు ఆ వయసులో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ ఇచ్చేలానే కనిపిస్తోంది.

ఒక అపార్ట్మెంట్.. అందులో ఈ ముగ్గురు క్రేజీ అంకుల్స్ ఉంటారు.. వారిలో యవ్వనం మళ్లీ బయటకు వస్తుంది.. ఇక శ్రీముఖి అందం, హోయలు, వయ్యారాలు చూసి అంకుల్స్‌కు ఆశ పుడుతుంది.. ఆమెను ఎలాగైన వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో క్రేజ్ అంకుల్స్ నానా పాట్లు పడేలా కనిపిస్తోంది. అయితే ఇంత చేసిన వాళ్లని శ్రీరామ చంద్రుడు అంటూ పోల్చడం మాత్రం చివర్లో ట్విస్ట్ ఇచ్చినట్టుగానే ఉంది. మొత్తానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు క్రేజీ అంకుల్స్‌తో శ్రీముఖి ఓ ఆట ఆడుకునేలానే ఉంది.