వైరల్ : “RRR” పై “స్పైడర్ మ్యాన్” హీరో కామెంట్స్.!

మన తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమాకి కూడా ఎంతో గర్వకారణం అయినటువంటి చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) వరల్డ్ వైడ్ సినిమా దగ్గర కూడా ఎంత రేంజ్ ఇంపాక్ట్ కలిగించిందో తెలిసిందే. మరి హాలీవుడ్ నుంచి సెన్సేషనల్ చిత్రం “అవతార్” దర్శకుడు జేమ్స్ కామెరాన్ స్టీవెన్ స్పెల్ బర్గ్ లాంటి దిగ్గజ దర్శకులని ఆశ్చర్య పరిచి ఆస్కార్ అవార్డు కూడా నెగ్గిన ఈ చిత్రం హాలీవుడ్ లో మరింత మంది ప్రముఖ మన్ననలు కూడా అందుకుంది.

ఇక లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లేటెస్ట్ స్పైడర్ మ్యాన్ యంగ్ హీరో టామ్ హోలాండ్ అయితే RRR చిత్రంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూ లో తాను మాట్లాడుతూ ఇంటర్వ్యూయర్ టామ్ ని రీసెంట్ గా ఇండియన్ సినిమా నుంచి ఎవరైనా యాక్టర్ గాని ఏదైనా సినిమా గాని చూసారా అని అడగ్గా తాను రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చూశానని నాకు ఆ చిత్రం చాలా బాగా నచ్చింది అని తెలిపాడు.

దీనితో ఇపుడు ఈ సినిమా అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ హీరోస్ లో కూడా RRR ఇంత రేంజ్ కి వెళ్ళింది అంటే జక్కన్న వర్క్ ఏ లెవెల్ కి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఇపుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.