చెప్పులు కుట్టే చిన్నయ్యగా ప్రదీప్‌.. వామ్మో ఎస్పీ శైలజ కూడా తగ్గడం లేదుగా!

ఒకప్పుడు పాటల ప్రోగ్రాం అంటే కేవలం పాటలు మాత్రమే వినిపించేవి. ఇక జడ్జ్‌లు అంటే పాటల్లోని తప్పులను, పాడిన శైలిని విమర్శించేవారు. అయితే ఇప్పుడు షో ఏదైనా సరే.. అందులోకుళ్లు కామెడీ ఉండాల్సిందే. పిచ్చి ట్రాకులు కూడా ఉండాల్సిందే. అవి ఉంటేనే అది షో అవుతోంది. డ్యాన్స్ షోలో డ్యాన్సులు తక్కువ అన్నట్టుగా.. ఇప్పుడు పాటల ప్రోగ్రాంలోనూ అసల్ది తక్కువ కొసరుది ఎక్కువైనట్టు కనిపిస్తోంది.

Sp Shailaja Counters On Anchor Pradeep In Sa Re Ga Ma Pa
SP shailaja counters On Anchor Pradeep In SA RE GA MA PA

ప్రస్తుతం సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అనే షో వస్తోన్న సంగతి తెలిసిందే. గ్రాండ్‌గా ఈ షోను ప్రారంభించడం.. కోటి, ఎస్పీ శైలజ, చంద్రబోస్ వంటి వారిని తీసుకొచ్చి గ్రాండ్‌గానే ప్రారంభించారు. అయితే యశస్వీ లైఫ్ ఆఫ్ రామ్ అనే పాట పాడే వరకు ఈ షోకు హైప్ రాలేదు.ఆ తరువాత యశస్వీ ఓవర్ నైట్ స్టార్ అవ్వడం, అతని కోసమే షో చూసే వారి సంఖ్య కూడా పెరిగింది. దాంతో పాటు హారిక నారాయణ్‌తో ప్రదీప్ కలుపుతున్న పులిహోర బాగానే వర్కవుట్ అవుతోంది.

అయితే ఈ ఆదివారం ప్రసారం కాబోతోన్న షోలో ప్రదీప్‌ను అందరూ కలిసి బాగానే ఆడుకున్నారు. ఓ సింగర్ ప్రదీప్ కోసం కథ రెడీ చేసిందట. రజినీ, పవన్ కళ్యాణ్‌లకు కూడా ఇవ్వలేదు.. హీరో చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడట.. ఇంట్రడక్షన్ సీన్‌లోనే పాతిక ట్రైన్‌లు గాల్లోకి లేస్తాయట.. అలా సైకిల్ మీద వస్తాడని చెబుతూ అది వద్దులే బెంజ్ మీద వస్తావ్.. కానీ చెప్పులు కుట్టుకునేవాడివి అంటూ సదరు సింగర్ కామెడీ చేసేసింది. అమ్మ గుండెకు అంత పెద్ద హోల్ కూడా ఉంటుందని స్టోరీని చెబుతూ వచ్చింది. అయితే ఈ స్టోరీకి టైటిల్ ఏంటి అని ప్రదీప్ అడిగితే.. ఎస్పీ శైలజ కౌంటర్ వేసింది. చెప్పులు కుట్టే చిన్నయ్య అంటూ పంచ్ వేసింది. దీనికి కోటి స్పందిస్తూ.. ఫసక్ అనే టైటిల్ ట్రెండీగా ఉంటుందని అన్నాడు. అయితే చెప్పులు కుట్టే చిన్నయ్యకు క్యాప్షన్ ఫసక్ అని పెడదామంటూ ఎస్పీ శైలజ కౌంటర్ వేసింది. మొత్తానికి ఎస్పీ శైలజ, కోటి వంటి వారు కూడా అలా మారిపోయారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles