Actor Harsha vardhan: ఎప్పుడైతే వేరే వాళ్ళతో ప్రాజెక్టు చేస్తుంటామో, వేరే వేరే వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటామో, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎవరికైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు.. కానీ ప్రస్తుత టాపిక్ లను ఎవరితోనూ షేర్ చేసుకునేది ఉండదని నటుడు హర్షవర్ధన్ అన్నారు. తనకున్న ఫ్రెండ్స్ సర్కిల్ చాలా అద్భుతమైనది అని, అలాంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికీ ఉండదు అని కచ్చితంగా చెప్పగలను అని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పారు. వాళ్లతోనే తాను అన్నీ షేర్ చేసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.
ఇకపోతే తాను రామ్ గోపాల్ వర్మ తో రోజు డ్రింక్ చేస్తానని, ఇళయరాజా గారితో లాంగ్ డ్రైవ్ కు రోజూ వెళ్తూ ఉంటానని, బాలసుబ్రహ్మణ్యం గారితో రోజూ భోజనం చేస్తూ ఉంటానని, బాబు గోగినేని గారు ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా తాను పిలిస్తే మార్నింగ్ వాక్ కు వచ్చేస్తారని అని ఆయన అన్నారు. వీళ్ళందరూ తన ఫ్రెండ్స్ అని, వీళ్ళే తన ఫ్రెండ్స్ సర్కిల్ అని ఆయన స్పష్టం చేశారు. వీకెండ్ కి ఒకసారి డైరెక్టర్ వంశీ వచ్చి వెళ్తూ ఉంటారని, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయారు కాబట్టి నెలకొకసారి వచ్చి వెళ్తూ ఉంటారని, వీళ్లందరి తోనే తన జీవితం సరిపోతుందని ఆయన తెలిపారు.
వీళ్లే కాదు తనకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని, వాళ్ళలో మియా మాల్కోవా కూడా తన గర్ల్ ఫ్రెండ్స్ లో ఒకరు అని, ఎప్పుడూ తనకు టచ్ లో ఉంటుందని హర్షవర్ధన్ అన్నారు. అందరికంటే తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని, వాడు యాక్టరో, డైరెక్టరో, మ్యూజిక్ డైరెక్టరో అర్థం కాకుండా ఉంటాడని వాడి పేరు హర్షవర్ధన్ అని, వాడే తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆయన చెప్పారు. ఎక్కువగా వాడితోనే ఏమున్నా షేర్ చేసుకుంటూ ఉంటానని ఆయన సరదాగా అన్నారు. వీళ్ళందరూ తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉంటారని, ఇంకోటి ఏంటంటే ఇందులో ఒకరు వస్తే ఇంకో ఫ్రెండ్ ని ఎవర్నీ రానివ్వరని ఆయన నవ్వుతూ చెప్పారు.