ఎస్పీ బాలుతో కృష్ణకు శోభన్ బాబుకు ఉన్న గొడవలు ఇవేనా?

తెలుగు జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో కృష్ణ గారి ఫ్యామిలీతో పాటు తెలుగు ప్రజలు అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణ నట వారసుడు మహేష్ బాబు కృష్ణ గారి పెద్దకర్మను చాలా ఘనంగా ప్రముఖ రాజకీయ నాయకులు సినిమా పెద్దలు కృష్ణ అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి మేమందరం తోడుంటామని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కృష్ణగారి మృతితో ఆయన సినీ జర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను కృష్ణ అభిమానులు నెమరు వేసుకుంటూ కృష్ణ గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అలాంటిదే ఈ చిన్న ఘటన కృష్ణ గారికి ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారికి మధ్య చిన్న వివాదం తలెత్తి మూడేళ్ల పాటు కృష్ణ సినిమా పాటలను పాడకుండా ఉన్నారు. బాలు గారు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఒకానొక దశలో బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశాలు తగ్గడంతో బాలు గారికి డబ్బులు అవసరం అయ్యి అతనికి ఇవ్వాల్సిన నిర్మాతకు ఫోన్ చేసి నాకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరారు. నేనేమైన పారిపోతానా ఇస్తానులే అంటూ దురుసుగా మాట్లాడారట ఆ నిర్మాత.వెంటనే హీరో కృష్ణ గారు ఫోన్ చేసి నువ్వు పాడక పోతే నా సినిమాలు హిట్ కావు అని అన్నావట అని బాలు గారిని అడగడంతో వారి మధ్య వివాదం తలెత్తింది.

కృష్ణ గారు, బాలు వీరిద్దరూ కలిసి పనిచేయకపోవడం వల్ల మ్యూజిక్ డైరెక్టర్స్ ఇబ్బందిపడేవారు. దీంతో సుందరరాంమూర్తి గారు చొరవ చూపి వీళ్ళను కలిపే ప్రయత్నం చేయగా బాలు గారు స్వయంగా కృష్ణ ఆఫీస్ కి వెళ్లి కలిసి క్షమాపణ చెప్తుంటే అవన్నీ అవసరం లేదు ఇప్పటినుంచి మనిద్దరం కలిసి పని చేద్దాం అంటూ కృష్ణ గారు చెప్పారట. ఇలాంటి సంఘటనే శోభన్ బాబు గారికి బాలు గారికి మధ్య కూడా జరిగింది. ఆ రోజుల్లో ఎక్కువగా రామకృష్ణ గారితో అగ్రహీరోలు పాడించుకోవడం వల్ల శోభన్ బాబు గారు కూడా ఆయనతో పాడించుకోవాలని అనుకున్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి బాలు గారితో పాడిద్దాం అంటే వద్దన్నారట. అలా ఒకరోజు బాలు గారు శోభన్ బాబు గారితో కలిసినప్పుడు ఆరోజు పాడించుకోకపోవడానికి కారణాలు బాలు గారితో చెప్తుంటే నాకేం బాధ లేదండి మీకు ఇష్టం వచ్చిన వారితో పాడించుకోవచ్చు అని సున్నితంగా చెప్పాడట బాలు గారు.