SP Balu: తనకు ఎవరూ గాడ్ ఫాథర్స్ లేరని, ఎలాంటి సపోర్ట్ కూడా లేదని, కానీ ఇంతవరకు వచ్చానంటే తానొక సెల్ఫ్‌మేడ్ పర్సన్ అనే ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందని సింగర్ విజయ లక్ష్మీ అన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు తానే కష్టపడి వచ్చిన కొద్ది ఛాన్స్‌ని కూడా తన మెరిట్ వల్ల తాను తెచ్చుకున్నదే అని, ఎవరూ తనకు హెల్ఫ్‌పుల్‌గా లేరని ఆమె చెప్పారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు మాత్రం తనకు మంచి సాంగ్స్ ఇచ్చారని ఆమె అన్నారు. మొదట్లో అవకాశం రాకపోయినా మాయదారి చిన్నోడు తర్వాత వరుసగా ఆయనకు 9 సినిమాల్లో పాడానని ఆమె చెప్పారు. ఇప్పుడు ఒకవేళ చక్రి గారు ఉండి ఉంటే తన కెరీరే కాదు, చాలా మంది కొత్త సింగర్స్‌కి కూడా అవకాశం వచ్చేదని ఆమె అన్నారు. ఆయన లోకల్ టాలెంట్ చాలా ఎంకరేజ్ చేస్తారన్న విజయ లక్ష్మీ, ఆయన మీద చాలా ఒత్తిడి ఉంటే గానీ వేరే వాళ్లతో అంటే కొత్త వాళ్లతో పాడించరని ఆమె స్పష్టం చేశారు. ఆయన కెరీర్‌లో తనతో పాటు ఉన్నవాళ్లను, ఇబ్బందుల్లో తనకు అండగా నిల్చిన వాళ్లను గుర్తుపెట్టుకొని వాళ్లకు అవకాశం ఇచ్చారని, చాలా మందికి ఆయన వల్ల మంచి కెరీర్ ఏర్పడిందని ఆమె అన్నారు.
సినిమా తీయడంతో పోలిస్తే సింగర్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ పెద్ద లెక్క కాదని ఆమె చెప్పారు. ఇప్పుడు కొంతమంది డిమాండ్ చేస్తేనే లక్షల్లో ఉంటుంది గానీ, అలాంటి పేమెంట్స్ ఇప్పుడు లేవని ఆమె అన్నారు. షోలో ఏదైనా పాడితే అది కొన్ని గంటలవరకే అని, కానీ ఒక సినిమాలో పాడిన పాట హిట్ అయితే అది కెరీర్ మొత్తం నిలిచిపోతుందని, అది భారీ హిట్ అయితే మాత్రం దాని వల్ల 3 ఏళ్ల వరకు అవకాశాలు కూడా పొందుతామని విజయ లక్ష్మీ చెప్పారు. దాని వల్ల డిమాండ్ కూడా పెరుగుతుందని ఆమె అన్నారు. కాబట్టి మూవీ సాంగ్ అనగానే సింగర్స్ అస్సలు వదులుకోరని, ఆ పాట తనకు మంచి హిట్ తెచ్చిపెడుతుంది అనుకుంటే ఎంతిస్తారు అనే దాని గురించి ఆలోచించరని ఆమె తెలిపారు.
మంచి హిట్ పడుతుందని నమ్మితే ఇంత కావాలి అని డిమాండ్ చేయకుండా ఎంతిస్తే అంత పుచ్చుకొని పాట పాడుతాం అని విజయ లక్ష్మీ అన్నారు. పాట హిట్ అయితే అది పర్మినెంట్ ఉండిపోతుందన్న స్వార్థమే దానికి కారణమని ఆమె స్పష్టం చేశారు. కాబట్టి సింగర్స్ పేమెంట్ అనేది పెద్ద లెక్క కాదు అని ఆమె చెప్పారు. నిజం చెప్పాలంటే కొన్ని సంవత్సరాల ముందు వరకు బాలు గారు కూడా లక్ష మాత్రమే తీసుకున్నారని, ఆయనతో పోలిస్తే అందరం తక్కువే కదా అని ఆమె తెలిపారు. కాబట్టి 20,25 లాంటి పేమెంట్ ఇచ్చినా అది మంచిదే అని, సాంగ్ పాడినందుకు సింగర్స్‌కు ఇచ్చే పేమెంట్ షోస్‌తో పోలిస్తే చాలా తక్కువేనని ఆమె వివరించారు.