సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డుల ప్రకటన… ఆర్‌ఆర్‌ఆర్‌, సీతారామం చిత్రాలకు అవార్డుల పంట!

2023 సంవత్సరానికి సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డులను ప్రకటించారు. వీటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ , సీతారామం చిత్రాలు సత్తా చాటి ఎక్కువ అవార్డులను దక్కించుకున్నాయి. విరాటపర్వం రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి తమిళంలో ఉత్తమ నటిగా, తెలుగులో క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా రెండు భాషల్లో అవార్డులు దక్కించుకోవడం విశేషం. అంతేగాక సౌత్‌ ఇండియాలో తక్కువ కాలంలో ఆరుసార్లు ఫిలింఫేర్‌ అవార్డు దక్కించుకున్న కథానాయికగా రికార్డు సృష్టించింది.

ఇంతకు ముందు నాలుగుసార్లు, ఇప్పుడు రెండు అవార్డులతో కలుపుకుని మొత్తంగా 6 అవార్డులు రాగా ఇందులో 4 అవార్డులు తెలుగు చిత్రాలకే రావడం గమనార్హం. రామ్‌ చరణ్‌ కు 4వ సారి అవార్డు దక్కింది. ఇప్పటికే 17 ఫిలింఫేర్‌ అవార్డులతో దేశంలోనే టాప్‌ ప్లేస్‌లో ఉన్న కమల్‌ హసన్‌ ఖాతాలో 18వ సారి అవార్డు వచ్చి చేరింది. అదేవిధంగా తమిళంలో ధనుష్‌ నటించిన తిరు సినిమా అధికంగా అవార్డులు గెలుచుకోవడం విశేషం.

తెలుగులో ఉత్తమ చిత్రం (ఆర్‌ఆర్‌ఆర్‌).. ఉత్తమ దర్శకుడు రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌).. ఉత్తమ నటులు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌).. ఉత్తమ నటి మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం).. ఉత్తమ సంగీత దర్శుడు కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌).. ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం), ఉత్తమ గాయకుడు కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌ ,కొమరం భీముడో).. ఉత్తమ గాయని (ఫిమేల్‌) చిన్మయి శ్రీపాద (సీతారామం).. ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) సీతారామం.. ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) దుల్కర్‌ సల్మాన్‌ (సీతారామం) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) సాయి పల్లవి ( విరాట పర్వం).. ఉత్తమ సహాయ నటుడు రానా (భీమ్లా నాయక్‌), ఉత్తమ సహాయ నటి నందితా దాస్‌ (విరాట పర్వం).. ఉత్తమ సినిమాటోగ్రఫీ సెంథిల్‌, రవి వర్మన్‌, ఉత్తమ ప్రోడక్షన్‌ డిజౌన్‌ సాబు సిరిల్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌).. ఉత్తమ నఅత్య దర్శుడు ప్రేమ్‌ రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)