చనిపోయే ముందు సౌందర్య ఆఖరి మాటలు ఇవే?

సౌందర్య అంటేనే ఆమె ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఫోటో కళ్ళముందు కదులుతుంది.ఎంతో అందమైన నగుమోమతో సాంప్రదాయపద్ధంగా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సౌందర్య. ఈమె కన్నడ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ విధంగా సౌందర్య 12 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగి దాదాపు 120 కి పైగా సినిమాలలో నటించారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బిజెపి ప్రభుత్వం క్యాష్ చేసుకుని తనని తమ పార్టీలోకి ఆహ్వానించారు.ఇలా 2004 ఎన్నికల పోటీలో భాగంగా ఈమె పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సీహెచ్ విద్యాసాగర్ రావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయనకు మద్దతుగా సినీ నటి సౌందర్యతో  ప్రచారం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది.ఈ ప్రచారంలో భాగంగా సౌందర్య తన అన్నయ్య అమర్నాథ్ తన ఫ్రెండ్ రమేష్ ముగ్గురు కలిసి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కరీంనగర్ బయలుదేరారు.

ఇక ఈ ముగ్గురు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత హెలికాప్టర్ స్టార్ట్ అయి గాల్లోకి ఎగిరింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ పైలెట్ వేగం పెంచక ముందే వేగం పెరిగిపోవడంతో లోపల ఉన్నవాళ్లు ఏమైంది అంటూ ప్రశ్నించారు. పైలెట్ సమాధానం చెప్పేలోపు ఒక్కసారిగా హెలికాప్టర్ కిందకు దూసుకు వచ్చింది.భయంతో లోపల ఉన్నవారు కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విమానయాన సిబ్బంది కాపాడటం కోసం ప్రయత్నించారు. అప్పటికే పెద్ద శబ్దంతో బెంగళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఒక యూనివర్సిటీ ప్రాంగణంలో హెలికాప్టర్ కూలిపోయింది. విమానయాన సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు సౌందర్య చీర మంటలలో చిక్కుకుపోయింది. మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన వీలు కాలేదు. మంటలు ఆర్పేసరికి హెలికాప్టర్ లో ఉన్న నలుగురు మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు.బ్రతకాలన్న ఆశతో ఈ ప్రమాదం జరిగే సమయంలో కాపాడండి అంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టినట్లు తెలుస్తుంది.