సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాస్తే పేజీలకు పేజీలు నిండుతుంది. లాక్ డౌన్ టైమ్ లో ఆయన చేసిన సాయం ఏనాటికీ మరువలేనిది. నిరుపేద కూలీలు లాక్ డౌన్ సమయంలో తమ ఊళ్లకు వెళ్లలేక నరకయాతన అనుభవిస్తుంటే… ఏ ప్రభుత్వమూ పట్టించుకోకున్నా.. నేనున్నాంటూ వలస కూలీలను తన సొంత ఖర్చులతో వాళ్ల స్వస్థలాలకు పంపించారు సోనూసూద్.
అప్పటి నుంచి ఆయన ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూనే ఉన్నారు. ఎందరికో ఆర్థిక సాయం అందించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లకు కూడా ఆర్థిక సాయం అందించి దేవుడయ్యారు సోనూసూద్.
అలా చాలామంది దృష్టిలో దేవుడయ్యారు సోనూసూద్. దీంతో కోల్ కతాలో ఏకంగా సోనూసూద్ విగ్రహాన్నే ఏర్పాటు చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దేవీ మండపం వద్ద సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. తమకు సోనూసూద్ మీద ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం సోనూసూద్ విగ్రహం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోనూసూద్ కు ఇటువంటి గౌరవాలు ఇంకెన్నో దక్కాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Kolkata Durga Pujo Theme…@SonuSood sir statue…proud moment..🙏 ..MAA durga bless u always…Stay happy & safe sir…Durga Pujo Subecha roilo sir Apne k & apnar so-paribaar k 🙏 pic.twitter.com/BztrXguTWh
— Being_Human 🤝🇮🇳 (@Yaash_07) October 22, 2020