వినూత్నంగా చూపించాలని అలా చేశాను.. ఫతేహ్ సినిమా గురించి సోనుసూద్ లేటెస్ట్ అప్డేట్స్!

అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో తెలుగు ప్రజలకి దగ్గరైన నటుడు సోనుసూద్. కరోనా సమయంలో అతను చేసిన సేవలతో దేశం మొత్తానికి రియల్ హీరోగా మారిపోయాడు. నటనలో తన టాలెంట్ నిరూపించుకున్న ఈ నటుడు ఇప్పుడు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సోను సూద్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ‘ఫతేహ్” ‘ సైబర్ క్రైమ్ వలన నిజ జీవితంలో బాధపడిన సంఘటనలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది.

ఈ చిత్రం భారతీయ మరియు హాలీవుడ్ సిబ్బంది కలిసి మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాలను అందించడానికి ప్రయత్నిస్తుంది . శక్తి సాగర్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్‌పై సోనాలి సూద్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ యొక్క సంక్లిష్టతలు మరియు సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా జనవరి 10 విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఉన్న యాక్షన్స్ అన్ని వేశాలు అనిమల్ సినిమాని తలపించేలా ఉన్నాయి అంటూ చాలామంది కామెంట్ చేశారు. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇదే విషయంపై స్పందించారు సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించాము. యానిమల్ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి.

అందులో రణబీర్ కపూర్ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. అయితే మా సినిమాలో ముఖ్యంగా మూడు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. ఇందుకోసం 70 మంది ఫైటర్స్ ని విదేశాల నుంచి రప్పించాము హీరో ఒక క్వీన్స్ లో 70 మందిని చంపేస్తాడు మరొక సీను కోసం మరింత మందిని చూపించడం కష్టం కాబట్టి వారి ముఖానికి మాస్కులు వేసి మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసాము. సీన్ ని డిఫరెంట్ గా చూపించాలనే ఉద్దేశంతోనే అలా చేశాము అని చెప్పుకొచ్చాడు సోనుసూద్.